»   » మహేష్‌బాబు వెళ్లి పరామర్శించాడు (ఫొటో)

మహేష్‌బాబు వెళ్లి పరామర్శించాడు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: గుంటూరు లోక్‌సభ సభ్యుడు, తన బావ గల్లా జయదేవ్‌ను సినీనటుడు మహేశ్‌బాబు పరామర్శించారు. ఆగస్టు 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో జయదేవ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.

అయితే తాను కోలుకొని నడవగలుగుతున్నానంటూ.. ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. సినీ నటుడు మహేష్‌ బాబు తన భార్య నమ్రతతో కలిసి జయదేవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో కలిసిన దిగిన ఓ ఫొటోను జయదేవ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇక్కడ మీరు చూడండి.

Progressing... could get up and take a few steps at home today, with Mahesh Babu & family

Posted by Jayadev Galla on 11 September 2015

మహేష్ బాబు తాజా చిత్రం విషయానికి వస్తే....

‘శ్రీమంతుడు' తో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు పూర్తి ఉత్సాహంతో సెప్టెంబర్ 16 నుంచి ఆయన తదుపరి చిత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. అందుకోసం టెంపుల్ సిటీ అయిన తిరుపతిని ఎంచుకున్నారు. అనగా బ్రహ్మోత్సవం ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో మొదలు కానుంది.

mahesh babu

ఆ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొననున్నాడు. సెప్టెంబర్ 16 నుంచి ఆగకుండా ఏకధాటిగా షూటింగ్ చేసే విధంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. కంటిన్యూగా షూటింగ్ చేసి 2016 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.

English summary
Guntur MP Galla Jayadev met with an accident while test driving a high-end bike and has been admitted at Apollo Hospital in the city recently.His Brother in law Mahesh babu visited Galla at home and enquired about his health condition. Many politicians and film personalities paid a visit to Apollo and inquired about his healing.
Please Wait while comments are loading...