»   » ‘పిచ్చెక్కిస్తా’ అంటూ హీరోయిన్ హాట్ ఫోజులు (ఫోటోలు)

‘పిచ్చెక్కిస్తా’ అంటూ హీరోయిన్ హాట్ ఫోజులు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, స్టార్ దర్శకులు, పెద్ద బేనర్లు.....వీటిలో ఏ ఒక్క అంశం సినిమాలో ఉన్నా ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. మరి ఇలాంటి అర్హతలు లేని సినిమాలకు పబ్లిసిటీ పెంచడం చేయడం ఎలా? అందుకే ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ పెంచేందుకు దర్శకులు, నిర్మాతలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.

తమ సినిమా వైపు ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్‌ అట్రాక్ట్ అయ్యేలా సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. సినిమా టైటిల్స్ స్పైసీగా పెట్టడంతో పాటు.....హీరో, హీరోయిన్లతో హాట్ అండ్ సెక్సీ రొమాంటిక్ ఫోటో షూట్లు జరిపి ఇంటర్నెట్ మీడియా ద్వారా సినిమాకు ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అలాంటి సినిమాల్లో ఒకటి తాజాగా తెరకెక్కిస్తున్న 'పిచ్చెక్కిస్తా' చిత్రం. స్పైసీ టైటిల్, హాట్ అండ్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న ఈచిత్రం విశేషాలు స్లైడ్ షోలో....

పిచ్చెక్కిస్తా

పిచ్చెక్కిస్తా


ఎన్.కె, హరిణి జంటగా 7 ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘పిచ్చెక్కిస్తా' అనే పేరును ఖరారు చేశారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్

రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్


ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ- ఈ పేరు వినగానే చాలామంది నెగెటివ్‌గా ఆలోచిస్తారు. కానీ, చిత్రంలో వున్న థ్రిల్‌కు, సంతోషానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించామని, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటినుండి చివరివరకూ ప్రేక్షకులు నవ్వేవిధంగా రూపొందించామని తెలిపారు.

. ఫ్యామిలితో కలిసి చూడొచ్చట

. ఫ్యామిలితో కలిసి చూడొచ్చట


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఈనెలలో విడుదల చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఆయన అన్నారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు


ఈ చిత్రానికి కెమెరా: రాము.జి., సంగీతం: నవనీత్ చారి, రచన, నిర్మాత, దర్శకత్వం: శ్రీకాంత్ రెడ్డి.

స్పైసీ ఆలోచన...

స్పైసీ ఆలోచన...


ఈ ఫోటో చూస్తుంటే ఏమనిస్తోంది. హీరోయిన్ హీరోను ఎక్కడో...ఏదో చేస్తున్నట్లు ఉంది కదూ. యూత్‌ను ఆకట్టుకునేందుకే ఈ స్పైసీ ఆలోచన చేసినట్లు స్పష్టమవుతోంది.

English summary

 NK and Harini starring Pichekkistha comming soon. Directed by Srikanth Reddy and produced by 7 Arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu