»   » పోలా...! అదిరిపోలా...!! : ప్రీతీ జింతా రిసెప్షన్ లో తారల సందడి

పోలా...! అదిరిపోలా...!! : ప్రీతీ జింతా రిసెప్షన్ లో తారల సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండు నెలల క్రితం లాస్ ఏంజిల్స్ లో తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ ఎనఫ్ ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది.

ఫిబ్రవరి 28న జరిగిన పెళ్లి వేడుక తరువాత తన భర్తతో కలిసి ఇటీవలే ముంబై చేరుకుంది ప్రీతి. ఈ సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్ని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫారూక్ ఖాన్, షాహిద్ కపూర్, యువరాజ్ సింగ్, లారాదత్త, డినో మోరియా, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, జూహీచావ్లా, ఫరాఖాన్, మహేష్ భూపతి, మాధవన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రీతి పొడవాటి రెడ్ గౌనులో మెరిసిపోయింది. సంప్రదాయాన్ని గౌరవించేలా ఆమె చేతికి ఎరుపు, తెలుపు కలిసిన గాజులు వేసుకుని అందరికీ ఆకర్షించింది. ఇక ఆమె భర్త జెనీ... నల్లటి సూట్ లో యువరాజులా ఉన్నాడు. ఈ రిసెప్షన్ పార్టీలో ప్రీతి- జెనీ జంట కన్నా ఎక్కువ మంది సల్మాన్ జంటని చూసేందుకే ఆసక్తి చూపించారు.

ఎందుకంటే సల్మాన్ తన తాజా గర్ల్ ఫ్రెండ్ రొమేనియాకు చెందిన లులియా వాంతర్ తో వచ్చాడు. మీడియా నుంచి తప్పించుకునేందుకేమో వారు చాలా లేటుగా పార్టీకి వచ్చారు. సల్మాన్ ఒక కారులో రాగా, ఆ కారును ఫాలో అవుతూ లులియా కారు వచ్చింది. సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ లులియా తో కలిసి రావటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

కొత్త దంపతుల పార్టీ: దాదాప్ రెండునెలల క్రితం లాస్ ఏంజెల్స్ లో ఎవరికీ చెప్పకుండా గప్ చిప్ గా పెళ్ళి చేసుకున్న ఈ జంట. బాలీవుడ్ నేస్తాల కోసం ముంబై లో ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసారు.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

కొత్త దంపతుల పార్టీ: చిన్న నాటి స్నేహితుడే అయిన జీనీ గుడెనఫ్ ని పెళ్ళి చేసుకున్న ప్రీతి. భర్త తో కలిసి చిరునవ్వులతో బాలీవుడ్ మిత్రులని రిసీవ్ చేసుకుంది.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

మెరిసిపోయింది: మెరూన్ కలర్ డిజైనర్ గైన్ లో దేవకన్యలా మెరిసిపోయింది సొట్టబుగ్గల సుందరి. హోస్ట్ గా అందరినీ పలకరిస్తూ సందడి చేసింది.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతి మాజీహీరో: జూం బరాబర్ జూం, కభీ అల్విదా నా కెహెనా ల్లో ప్రీతి తో కలిసి నటించిన అభిషేక్ బచ్చన్. ప్రీతితో కాస్త దూరంగా నే మెలిగాడు.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

రాబోయే బేబీ కూడా: క్యూట్ హీరో ఆఫ్ బాలీవుడ్ షాహీద్ కపూర్ భార్య మిరా రాజ్పూత్ తో కలిసి వచ్చాడు. మిరా ఇప్పుడు గర్భవతి. ఇద్దరూ ముచ్చటగా కనిపించారు.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

ధక్ ధక్ ధడ్కన్: మాధురీ దీక్సిత్ తన భర్త శ్రీరాం నేనే తో కలిసి వస్తే, నల్లని చీరలో లారా దత్తా మరింత అందంగా కనిపించింది ఈ అమ్మడు కూడా తన భర్త టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తో పార్టీకి హాజరైంది.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

ఇంకా తగ్గలేదు: జూహీ ఇప్పుడు కూడా అందరి చూపులనీ తనవైపే తిప్పుకుంది.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

సంగతేంటీ..?: క్రికెటర్ యువరాజ్ సింగ్ నటి హజల్ కీచ్ తో కలిసి వచ్చాడు. ఎక్కువసేపు ఉండకుందానే ఇద్దరూ అక్కన్నుంచుఇ జంప్ అయ్యారట.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

సాలా ఖడూస్ తీన్: మాదవన్ ఎప్పుడూ లేంది పెద్ద మీసాలతో వెరైటీ లుక్ లో కనిపిస్తే అభయ్ డియోల్,కరన్ జోహార్ లు డిగ్నిఫైడ్ లుక్ లో సైలెంట్ గా ఉండిపోయారు.

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

డినో డాన్స్: డినో మోరియా (డాన్స్) డైరెక్టర్ ఫరాఖాన్

ప్రీతీ జింతా రిసెప్షన్

ప్రీతీ జింతా రిసెప్షన్

కాబొయే కొత్త జంట?: చోరీ చోరీ చుప్కే చుప్కే హీరో బాలీవుడ్ కండల హీ మాన్ సల్మాన్ ఖాన్, తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇయూలియా తో పార్టీ బయట ఇలా కెమెరాకి చిక్కాడు. చోరీ... సినిమా సమయం లోనే బాలివుడ్ లో మాఫియా కదలికలు కనిపించాయి. అప్పుడు ప్రీతి ఇచ్చిన సాక్ష్యం సంచలనమే అయ్యింది....

English summary
Preity Zinta with husband Gene Goodenough at her post-wedding bash in Mumbai. Bollywood who’s who attended the reception
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu