Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మా మతంలో ఇలా చేయకూడదంటూనే....మీడియా ముందు తాప్సీ సంచలనం!
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు సూజిత్ సర్కార్ తెరకెక్కించిన హిందీ చిత్రం 'పింక్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది.
సోమవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో తాప్సీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాపై రివ్యూలన్నీ పాజిటివ్ గా వచ్చాయని, సినిమాలో యావరేజ్ గా ఉందనిగానీ, బాగోలేదని గానీ ఒక్క ట్వీట్ కూడా రాలేదని, తన పాత్ర బాగుందంటూ మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయంటూ ఆనందం వ్యక్తం చేసింది తాప్సీ.
అంతటితో ఆగకుండా ఈ అవకాశం తనకిచ్చిన శూజిత్‌కు ధన్యవాదాలు చెబుతూ....మీడియా చూస్తుండగానే ఆయన కాళ్లకు నమస్కరించారు. నేను సిక్కు మతానికి చెందిన అమ్మాయిని. మా సాంప్రదాయం ప్రకారం ఇలాంటివి చేయకూడదు. కానీ శూజిత్‌కి మాత్రం ఇలాగే ధన్యవాదాలు చెప్పదలచుకున్నానని ఆమె సంచలన చర్యకు పాల్పడింది తాప్సీ.

అంచనాలు భారీగానే
ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీసిన చిత్రం ఇది. అమితాబ్.. శూజిత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కావడంతో సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా సినిమాకు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ఫస్ట్ వీకెండ్
ఫస్ట్ వీకెండ్ ఈచిత్రం మొత్తం రూ. 21.51 కోట్లు రాబట్టింది. తొలిరోజు(శుక్రవారం) రూ. 4.32 కోట్లు, రెండో రోజు (శనివారం) రూ. 7.65 కోట్లు, ఆదివారం ఏఖంగా . 9.54 కోట్లు వసూలు చేసింది. చిత్రం రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ అద్భుతంగా రాణిస్తుండటంతో చిత్ర బృందం సంతోషంగా ఉన్నారు.

సినిమా స్టోరీ
ఢిల్లీలో మినాల్ అరోరా(తాప్సీ) ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది. ఓరోజు తన ఇద్దరు స్నేహితురాళ్లు ఫలక్ అలీ(కీర్తి కుల్హరి).. ఆండ్రియా(ఆండ్రియా తరియంగ్)తో కలిసి రాత్రి ఓ ఈవెంట్‌కు వెళ్తుంది. అక్కడ వారికి ఓ రాజకీయవేత్త కుమారుడు రాజ్‌వీర్ సింగ్(అంగద్ బేడీ) అతని స్నేహితులతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్లు మినాల్.. ఆమె స్నేహితురాళ్లను ఓ రిసార్ట్‌కి విందుకు ఆహ్వానిస్తారు. అక్కడికెళ్లాక వారిపై రాజ్‌వీర్ బృందం బలవంతం చేయబోతే తప్పించుకునే క్రమంలో రాజ్‌వీర్‌ను మినాల్ గాయపరుస్తుంది. దీంతో తన పలుకుబడితో మినాల్‌పై హత్యాయత్నం కింద తప్పుడు కేసు పెడతాడు. కోర్టులో మినాల్ తరఫున కేసు వాదించడానికి బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడే న్యాయవాది దీపక్ సెహ్‌గల్(అమితాబ్ బచ్చన్) ముందుకొస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

బాగా ఆడుతోంది
అమితాబ్ బచ్చన్, తాప్సీ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.