Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి ఫైట్: అదే జరగకపోయుంటే.. రెండు సినిమాల కలెక్షన్లు భారీగా పెరిగేవే.!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ఈ పండుగ సమయంలోనే గ్రామాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. అదే సమయంలో సినిమాల పరంగానూ ఇలాంటి పోటీనే కనిపిస్తుంది. బరిలో కోడి పుంజులు పోరాడినట్లు.. ఈ సీజన్‌లో బడా హీరోలు పోటీ పడుతుంటారు.
ఇక, ఎన్నో రోజులుగా తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్న సీజన్ రానే వచ్చింది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా భారీ సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదే జరగకుపోయుంటే ఈ సినిమాల కలెక్షన్లు భారీగా పెరిగేవే.!

సంక్రాంతి బరిలో ముందు వచ్చిన పందెంకోడి
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సారి సంక్రాంతి రేసులో నిలిచాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ నిర్మించాడు.

ఒకరోజు ఆలస్యంగా వచ్చిన మరో పందెంకోడి
అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీని రాధాకృష్ణ, అల్లు అరవింద్ కలిసి నిర్మించారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో నవదీప్, సుశాంత్, టబు, సముద్రఖని, మురళీ శర్మ, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

మొదటి నుంచీ పోటీ పడుతూనే ఉన్నారు
‘సరిలేరు నీకెవ్వరు', ‘అల.. వైకుంఠపురములో' సినిమాలు ప్రారంభమైనప్పుడే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అప్పటి నుంచే ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు మూవీల చిత్ర యూనిట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రమోషన్లు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు ఇద్దరు హీరోలు.

ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి
ఇద్దరు బడా హీరోలు.. రెండు పెద్ద సినిమాలు ఒకరోజు వ్యవధిలో రావడంతో ఏది హిట్ అవుతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. అదే సమయంలో ఈ రెండింటిలో ఒక సినిమానే హిట్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ, దీనికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. సంక్రాంతికి వచ్చిన ఈ రెండు మూవీలు సూపర్ హిట్ అవడంతో, భారీగా కలెక్షన్లు రాబడుతున్నాయి.

అదే జరగకపోయుంటే కలెక్షన్లు భారీగా పెరిగేవే.!
ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు భారీ వసూళ్ల దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు', ‘అల.. వైకుంఠపురములో' పైరసీ కావడంతో ఈ రెండింటి కలెక్షన్లపై ప్రభావం భారీగా పడిపోయింది. ఒకవేళ అదే జరగకపోయుంటే పరిస్థితి వేరేగా ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పండుగ రద్దీలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే పైరసీపైనే ఆధారపడుతున్నారని కూడా అంటున్నారు.

24 గంటలు అవకముందే ఎదురుదెబ్బలు
మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే, 24 గంటలు గడవకముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అలాగే, జనవరి 12న వచ్చిన ‘అల.. వైకుంఠపురములో'కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ రెండు సినిమాలకు ఎదురుదెబ్బలు తగిలినట్లైంది.