twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడియోకు ముహూర్తం 12.12.12-12:12:12

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, రమ్య నంబీసన్ జంటగా నటించిన 'పిజ్జా' చిత్రం తమిళంలో విజయవంతం కాగా తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. ఈచిత్రం ఆడియో ఈ నెల 12వ తేదీ, 12వ నెల, 12వ సంవత్సరం, 12 గంటల, 12 నిమిషాల, 12 సెకన్లకు విడుదల చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు.

    పిజ్జా కథ సరికొత్తగా ఉంటుందని, ఫ్యామిలీ యూత్‌ను ఆకట్టుకుంటూ సాగుతుందని, డబ్బింగ్ మరియు రీమేక్ హక్కులకు పోటీ ఉన్నా తమ ఎస్.కె. పక్చర్స్ సంస్థపై నమ్మకంతో అనువాద హక్కులు ఇచ్చారని సురేష్ కొండేటి తెలిపారు. ఇందులో 8 పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయని, ఎంటర్‌టైన్‌మెంట్ శాతం కూడా ఉంటుందని, యూత్‌కు నచ్చే రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల వారికి నచ్చే కామెడీతో చిత్రం రూపొందిందని ఆయన వివరించారు.

    ఈ చిత్రంలో పిజ్జా సెంటర్ ఓనర్ పాత్రకు నిర్మాత నాగబాబు డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ 'తమిళంలో వచ్చిన సినిమాను అనువదించడం కంటే రీమేక్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే విషయం నేను సురేష్ కి చెప్పాను. కానీ కొన్ని విజువల్స్, కొంత టేకింగ్, కొన్ని ఎమోషన్స్ తిరిగి ప్రొడ్యూస్ చేయడం కష్టమని అతను చెప్పాడు. నేను ఈ సినిమాలో పిజ్జా సెంటర్ ఓనర్ పాత్రకి డబ్బింగ్ చెప్పాను. సురేష్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది' అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు.

    English summary
    The audio launch of Pizza has been confirmed on the 12th of December. It happens to fall on the special date of 12-12-12, which is being considered as something significant by many.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X