twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ హిట్ 'పిజ్జా' తెలుగు వెర్షన్ విడుదల తేదీ

    By Srikanya
    |

    Pizza
    వేడంగిపాలెం : ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పిజ్జా' చిత్రాన్ని ఈనెల 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కొండేటి సురేష్‌ చెప్పారు. స్వగ్రామమైన పోడూరు మండలం వేడంగిపాలెం గ్రామానికి ఆయన ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రంలో కుటుంబ సమేత కథ, యాక్షన్‌, సస్పెన్స్‌, ప్రేమాయణంలు ఉంటాయన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌లో వచ్చిన ప్రేమిస్తే, జర్నీ చిత్రాల అంతటి విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే నమ్మకంతో తానే ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ చిత్రం 350 థియేటర్స్‌లోనూ, జిల్లాలో ఎనిమిది థియేటర్స్‌లోనూ విడుదల కానుందన్నారు.

    హైదరాబాద్ : కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, రమ్య నంబీసన్ జంటగా నటించిన 'పిజ్జా' చిత్రం తమిళంలో విజయవంతం కాగా తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. పిజ్జా కథ సరికొత్తగా ఉంటుందని, ఫ్యామిలీ యూత్‌ను ఆకట్టుకుంటూ సాగుతుందని, డబ్బింగ్ మరియు రీమేక్ హక్కులకు పోటీ ఉన్నా తమ ఎస్.కె. పక్చర్స్ సంస్థపై నమ్మకంతో అనువాద హక్కులు ఇచ్చారని సురేష్ కొండేటి తెలిపారు. ఇందులో 8 పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయని, ఎంటర్‌టైన్‌మెంట్ శాతం కూడా ఉంటుందని, యూత్‌కు నచ్చే రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల వారికి నచ్చే కామెడీతో చిత్రం రూపొందిందని ఆయన వివరించారు.

    ఈ చిత్రంలో పిజ్జా సెంటర్ ఓనర్ పాత్రకు నిర్మాత నాగబాబు డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ 'తమిళంలో వచ్చిన సినిమాను అనువదించడం కంటే రీమేక్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే విషయం నేను సురేష్ కి చెప్పాను. కానీ కొన్ని విజువల్స్, కొంత టేకింగ్, కొన్ని ఎమోషన్స్ తిరిగి ప్రొడ్యూస్ చేయడం కష్టమని అతను చెప్పాడు. నేను ఈ సినిమాలో పిజ్జా సెంటర్ ఓనర్ పాత్రకి డబ్బింగ్ చెప్పాను. సురేష్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది' అన్నారు.

    'నేను నా కెరీర్‌లో ఎక్కువ శాతం విజయవంతమైన చిత్రాలకే డబ్బింగ్ చెప్పాను. వాటిలో 'పిజ్జా' కూడా చేరుతుంది. మనం తినే పిజ్జాలో ఎన్ని రుచులుంటాయో అంతకంటే ఎక్కువ రుచులున్న సినిమా 'పిజ్జా'' అన్నారు హీరో శివాజీ. ఈ చిత్రానికి నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు.

    English summary
    Kollywood film Pizza starring Vijay Sethupathi and Remya Nambeesan that turned out to be huge hit at the Box-Office is dubbed in Telugu by Producer Suresh Kondeti. The Telugu version also titled Pizza is hitting the screens on 15th February. Karthik Subbaraj himself has written the story and screenplay, besides directing this horror thriller. The film has cinematography by Gopi Amarnatha, musical scores by Santhosh Narayanan, dialogues and lyrics by Sahithi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X