»   » చిరంజీవిని... పవన్ కళ్యాణ్ కలవడంపై వర్మ సెటైర్!

చిరంజీవిని... పవన్ కళ్యాణ్ కలవడంపై వర్మ సెటైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ నుండి కనీసం డ్రెస్సు కూడా మార్చకుండా నేరుగా వెళ్లి అన్నయ్య చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. చాలా విరామం తర్వాత 'బ్రూస్‌లీ' చిత్రంలో కనిపించిన అన్నయ్య చిరంజీవికి పవన్‌ అభినందనలు తెలిపారు. అయితే వీరి కలయికపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సెటైర్ వేసారు.

పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసిన వర్మ... నయాగారా జలపాతం తర్వాత ఇదే గొప్ప విజువల్. చాలా సంతోషంగా ఉంది... ఈ సంతోషంలో మరోసారి ‘బ్రూస్ లీ' సినిమా చూస్తాను అంటూ ట్వీట్ చేసారు. ఇలా ట్వీట్ చేయడం ద్వారా కష్టాల్లో పడ్డ బ్రూస్ లీ సినిమాకు ప్రచారం కల్పించడానికే పవన్ కళ్యాణ్ ఇలా చేసాడని చెప్పకనే చెప్పాడు వర్మ.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ మళ్లీ కలవడం కలే అనుకున్నాను. లేచి చూసాక ఇది నిజమే అని రియలైజ్ అయ్యాను. మెగా ఫ్యామిలీ విషయంలో ఇలా జరుగడం చాలా సంతోషంగా ఉంది అంటూ వర్మ ట్వీట్ చేసారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్


రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు సెటైరిక్ గా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

మెగా ఫ్యామిలీ గురించి


మెగా ఫ్యామిలీలో ఇలాంటి మంచి పరిణామం చోటు చేసుకోవడంపై వర్మ ఆనందం.

బ్రూస్ లీ సినిమా గురించి


బ్రూస్ లీ సినిమా గురించి వర్మ ట్వీట్లు....

వర్మ ట్వీట్లు


ఇటీవల బ్రూస్ లీ సినిమా చూసిన తర్వాత వర్మ కామెంట్ ఇది

English summary
"PK Mega together is greatest visual I saw since Niagara Falls ..I am so exhilarated nd going to see Bruce Lee again" Ram Gopal Varma tweeted.
Please Wait while comments are loading...