»   » పవన్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తోనే..,మొదలెట్టేసారు,ఇదిగో సాక్ష్యం

పవన్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తోనే..,మొదలెట్టేసారు,ఇదిగో సాక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చి, రిలీజ్ కు రెడీ అవుతూండటంతో, పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఏం చేస్తాడనే విషయమై గత కొద్ది రోజులుగా మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయమై ఖరారు అయ్యిపోయింది. ఇదిగో ఈ ఫొటోనే సాక్ష్యం.

పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని తన స్నేహితుడు, తనతో రెండు సినిమాలు గతంలో డైరక్ట్ చేసిన ఎస్ జె సూర్యతో చేయనున్నారు. అంటే 'సర్దార్‌...' తరవాత పవన్‌ చేయబోయే చిత్రం ఎస్‌.జె.సూర్యతోనే అని ఖారారు అయ్యిపోయింది.

ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తులు మొదలైపోయాయట. ఇటీవలే ముంబయిలో సంగీత చర్చలు మొదలయ్యాయని తెలిసింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

PK - S J Surya film Confirmed: Music session Started

ఇప్పటికే మొదటి పాట రికార్డింగ్ పూర్తైపోయింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ విషయమై అఫీషియల్ న్యూస్ రావచ్చు. ఈ చిత్రాన్ని సైతం 'సర్దార్‌...' నిర్మాత శరద్ మారార్ నిర్మించనున్నారు.

ఇక 'గోపాల గోపాల' సమయంలో అనూప్ ఇచ్చిన సంగీతాన్ని ఇష్టపడ్డ పవన్ ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా నిలబెట్టుకున్నారు. ఈ చిత్రం ఖుషీ సీక్వెల్ అని వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. కాబట్టి పవన్ ఫ్యాన్స్ మరి పండగ చేసుకోండి. నెక్ట్స్ సినిమా డిటేల్స్ తెలిసిపోయాయి కదా.

English summary
Pawan Kalyan and director S J Surya’s untitled film pre-production work has begun. Music session is already under progress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu