»   » పవన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: ఆయన్ను చెడగొడ్తుంది వాళ్లే!

పవన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: ఆయన్ను చెడగొడ్తుంది వాళ్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్‌కి వద్దయ్యా...నీ స్థాయి తగ్గిపోతుంది అక్కడ అంటూ రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్‌ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ మాటలను పవన్ కళ్యాణ్ కానీ, ఆయన అనుచరగణం కానీ, ఆయన అభిమానులు గానీ పట్టించుకోలేదు.

సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి అర్థమైంది. హిందీలో సర్దార్ రిజల్ట్ చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ.....మరోసారి ట్వీట్ చేసారు. అపుడు నేను ఎంత మొత్తుకున్న వినిపించుకోలేదని చెప్పుకొచ్చారు.

'సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ ఓపెనింగ్స్ కేవలం 2 శాతం మాత్రమే. నెలరోజుల ముందే హిందీ పవన్ కళ్యాణ్ కు వర్కౌట్ కాదని చెప్పాను. ఆయన చేస్తుంది బాహుబలియన్ మిస్టేక్ అని మొత్తుకున్నాను. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఆయన చుట్టూ ఉన్న వాళ్లే ఇలాంటి చెత్త సలహాలిస్తూ ఆయన్ను చెడగొడ్తున్నారు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

Also Read: అదిరిందయ్యా వర్మా..: వర్మ 'కంపెనీ' లోపల ఎలా ఉందో..చూస్తారా? (వీడియో)

'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ బాక్సాఫీసు రిజల్టుతో పవన్ కళ్యాణ్ కు చాలా చాలా బ్యాడ్ జరిగిపోయింది. నేషనల్ లెవల్‌లో పవన్ కళ్యాణ్ కంటే ప్రభాసే బిగ్గెస్ట్ స్టార్ అని తేలిపోయినట్లయింది అంటూ వర్మ ఆవేదనగా ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్‌ అభిమానిని అని చెప్పుకునే వర్మ ఆయన మంచి కోరి చాలా సలహాలు ఇచ్చారు.... కానీ ఆయన్ను అపుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇపుడు వర్మ చెప్పిందే నిజమైంది అని చర్చించుకుంటున్నారు.

స్లైడ్ షోలో వర్మ చేసిన ట్వీట్స్..

నేషనల్ లెవల్లో..

నేషనల్ లెవల్లో..

నేషనల్ లెవల్లో పవన్ కంటే ప్రభాసే పెద్ద స్టార్ అయి తేలిపోయింది అంటూ వర్మ ట్వీట్.

చుట్టూ ఉన్న వాళ్లే

చుట్టూ ఉన్న వాళ్లే

పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్లే ఆయనకు చెత్త సలహాలు ఇస్తున్నారంటూ...

సర్దార్ క్రాస్

సర్దార్ క్రాస్

హిందీ బక్సాఫీసు వద్ద సర్దార్ క్రాష్ అయిందంటూ ట్వీట్...

వర్మ

వర్మ

రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై చాలా కాలంగా హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.

English summary
"SGS Hindi opening is 2% and I predicted 1 month back it is a Bahubalian mistake. PK should open his eyes to bad advisers around him" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu