twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రగులుతూనే ఉన్న చిరు,రాజశేఖర్ వివాదం: దాసరి సంతాపసభలో బయట పడ్డ నిజాలు

    మెగాస్టార్ చిరంజీవి మరియు డాక్టర్ రాజశేఖర్ మధ్య కొన్ని పరిస్థితుల కారణం వల్ల గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చోటుచేసుకున్నాయి.

    |

    మెగాస్టార్ చిరంజీవి మరియు డాక్టర్ రాజశేఖర్ మధ్య కొన్ని పరిస్థితుల కారణం వల్ల గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చోటుచేసుకున్నాయి. ఈ విషయం పబ్లిక్ గా అందరికీ తెలిసిన విషయమే."ఠాగూర్‌" సినిమా నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి.

    ఠాగూర్‌

    ఠాగూర్‌

    తమిళం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ‘రమణ' సినిమా హక్కులను మొదట రాజశేఖర్‌ సొంతం చేసుకున్నారు. కానీ, చిరంజీవి చివరినిమిషంలో రంగంలోకి దిగి.. ఆ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆ సినిమాను ‘ఠాగూర్‌'గా రిమేక్‌ చేయడం.. అది సెన్సేషనల్‌ హిట్‌ కావడం అందరికీ తెలిసిందే.

    ఎవడైతే నాకేంటి

    ఎవడైతే నాకేంటి

    2006 లో వచ్చిన "ఎవడైతే నాకేంటి" మాతృక అయిన తమిళ లయన్ సినిమా విషయం లోనూ హక్కులు కొనే సమయం లో కూడా విభేదాలు వచ్చాయనీ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆతర్వాత చిరు రాజకీయాల్లోకి రావటం, రాజశేఖర్ ఏదో అన్నాడంటూ మెగా అభిమానులు ఆయన మీద దాడికి దిగటం లాంటి సంఘటనలతో ఆ తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు సరికదా.. దూరం మరింత పెరిగిపోయింది.

    రాజశేఖర్‌ వాహనంపై దాడి

    రాజశేఖర్‌ వాహనంపై దాడి

    చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్‌ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రాజశేఖర్‌ వాహనంపై దాడి జరగడం, చిరు స్వయంగా రాజశేఖర్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించడం తెలిసిందే. కాలం గడుస్తున్నకొద్దీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గుతాయని అంతా భావించారు.

    మనస్పర్ధలు చేరిగిపోయాయని

    మనస్పర్ధలు చేరిగిపోయాయని

    దానికి తగ్గట్టే అప్పట్లో ఇచ్చిన ఓ ప్రెస్ మీట్ లో చిరంజీవి తనకు మధ్య ఉన్న మనస్పర్ధలు చేరిగిపోయాయని, ప్రస్తుతం వారిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడుతున్నట్లు తెలిపారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంలో నాగబాబు కీకల పాత్ర పోషించాడని కూడా తెలిపాడు.

    దాసరి నారాయణరావు సంతాప సభ

    దాసరి నారాయణరావు సంతాప సభ

    అలాగే త్వరలోనే రాజశేఖర్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి తన ఇంట్లో జరగబోయే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. కానీ అలా జరగలేదని తాజాగా తెలుస్తోంది. ఇటీవల కన్నుమూసిన దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం ఫిల్మ్‌నగర్‌లో జరిగింది.

    ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు

    ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు

    చిరంజీవి ఈ సంతాపసభకు హాజరై.. మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరమే రాజశేఖర్‌ దంపతులు వచ్చారు. ఇది కేవలం యాదృచ్ఛికమేనని అనుకోవచ్చు. కానీ టాలీవుడ్‌ వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేందుకు ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని, చిరు-రాజశేఖర్‌ మధ్య ఇప్పటికీ సఖ్యత లేనట్టు కనిపిస్తున్నదని అంటున్నారు.

    English summary
    A condolence meeting was held on Saturday in memory of Dasari Narayana Rao who passed away on May 30. What set tongues wagging was that Rajsekhar turned up for the event only after Chiranjeevi had spoken and left the venue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X