twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా వేడుక: చిరంజీవి షష్టి పూర్తి కోసం ప్లాన్...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 60 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత షష్టి పూర్తి జరుపుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం 59 వయసులో ఉన్న చిరంజీవి ఈ ఏడాది ఆగస్టు 22 నాటికి 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతుల షష్టిపూర్తి ఘనంగా నిర్వహించాలని మెగా ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

    రామ్ చరణ్, నాగబాబు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటారని తెలుస్తోంది. మరో ఆరు నెలలు సమయం ఉండటంతో ఇప్పటి నుండే పర్ ఫెక్ట్ ప్లానింగ్ తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. బంధువులు, ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుక వివాహ మహోత్సవాన్ని తలపించేలా ఉంటుందని అంటున్నారు. ముహూర్తం, పరిస్థితులు అనుకూలిస్తే బర్త్ డే, షష్టి పూర్తి ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది.

    ఆసంగతి పక్కన పెడితే....రాజకీయాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్న చిరంజీవి త్వరలో 150వ సినిమాలో నటించబోతున్నారు. 150వ సినిమాకు సన్నద్ధం కావడంలో భాగంగా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సదస్సుకు డుమ్మా కొట్టడమే ఇందుకు నిదర్శనం.

    Planning for Chiranjeevi Shashtipoorthi

    నిమా షూటింగు మొదలవ్వాలంటే చిరంజీవి తన ఫిజిక్‌ను పాత్రకు తగిన విధంగా సిద్దం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ కూడా అవసరమే. అందుకే షూటింగు మొదలవ్వడానికి ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు.

    ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో 2015లో సినిమా తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

    English summary
    It is said that Ram Charan and Naga Babu have taken the responsibilities of Shashtipoorthi. They are planning to invite all the relatives of Chiranjeevi to the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X