»   »  'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' కు తోడుగా ప్రధాని మోడీ

'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' కు తోడుగా ప్రధాని మోడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: చాలా మల్టీ ఫ్లెక్స్ లలో నిన్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' చూస్తున్న వారికి ఇంటర్వెల్ లో వచ్చిన బిట్ చూసి ఆశ్చర్యమైంది. దాదాపు నిముషన్నర పాటు సాగే ప్రధాని మోడీ కు సంభందించిన వీడియోని కలిపారు. మేరా దేశ్ హై మహాన్, మేరా దేశ్ హై జవాన్ అంటూ సాగే ఈ వీడియోలో ప్రధాని మోడీ దేశానికి చాలా చేసారంటూ, కృతజ్ఞతలు తెలుపుతూ సాగుతుంది. ఈ వీడియోని సెన్సార్ బోర్డ్ ఛీఫ్ పహలజ్ నిహలాని రూపొందించారు.

ఈ చిత్రం నిర్మాణ సంస్ద రాజశ్రీవారితో తనకు సన్నిహిత సంభందాలు ఉన్నాయని, అందుకనే వారి సినిమాలో ఈ యాడ్ వేసేందుకు అంగీకరించారని నిహలానీ తెలిపారు. రాజశ్రీవారు దీనిపై మాట్లాడుతూ...ఇది దేశభక్తికు సంభందించిన వీడియో కావటంతో తాము సినిమాకు ఎటాచ్ చేసామని చెప్పారు. అయితే దీన్ని కొన్ని మల్టిఫ్లెక్స్ లలోనే ప్రదర్శిస్తున్నారు. ఆ వీడియో మీరూ ఇక్కడ చూడవచ్చు.

ఇక సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

ఈ చిత్రంలో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తూ కనిపించారు. చిత్రానికి భారీ స్దాయిలో ఓపినింగ్స్ వచ్చాయి. అయితే తొంభైల నాటి చిత్రంలా ఉందని బాలీవుడ్ లో విమర్శలు వస్తున్నాయి. అయితే సినిమా మాత్రం పూర్తి స్ధాయి కలర్ ఫుల్ గా ఉందని చెప్తున్నారు. రాజశ్రీ వారి హీరోయిన్ గా సోనమ్ అందంగా కనిపించినా నటనలో మాత్రం ఆ స్దాయి కనపరచలేదని చెప్తున్నారు.

PM Modi video with Salman Khan starrer ‘Prem Ratan Dhan Payo’

ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలవుతోంది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొస్తున్నారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

సల్మాన్‌కు ప్రేమ్‌ పేరుతో అదృష్టం కలిసొచ్చింది. బర్జాత్యాతో చేసిన చిత్రాలతో పాటు కొన్ని ఇతర చిత్రాల్లోనూ సల్మాన్‌ పాత్రకు ప్రేమ్‌ పేరు పెట్టారు. అవి దాదాపు విజయం సాధించాయి. ఇప్పుడు 'ప్రేమ్‌ రతన్‌..'తో సల్మాన్‌ 12వ సారి ప్రేమ్‌గా కనిపించబోతున్నాడు.

English summary
Censor board chief Pahlaj Nihalani has produced a music video titled ‘Mera desh hai mahaan, mera desh hai jawan’ which, he says, is to “thank Prime Minister Narendra Modi for all that he has done for the nation”. A shorter version is now being played during the interval of the latest Salman Khan-starrer Prem Ratan Dhan Payo in several cinema halls across the country.
Please Wait while comments are loading...