Just In
Don't Miss!
- Finance
నీరవ్ మోడీకి భారీ షాక్, భారత్ రప్పించేందుకు లండన్ కోర్టు ఓకే
- News
బ్రేకింగ్: ముఖేశ్ అంబానీ ఇంటి బయట జిలేటిన్ స్టిక్స్.. రంగంలోకి క్రైం బ్రాంచ్
- Sports
India vs England: చెలరేగిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం!
- Automobiles
50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే
- Lifestyle
కడుపులో పిండం ఆరోగ్యకరమైన అభివృద్ధికి విటమిన్ A ఆహారాలు చాలా అవసరం !! లేదంటే తల్లి బిడ్డకు అంధత్వం..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతీయుడు 2 ప్రమాదం: పోలీస్ కేసు ఫైల్.. కమల్ హాసన్‌కి సమన్లు
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భారతీయుడు 2 ' సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రమాదంపై చెన్నై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ లకు సమన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి పోతే..

క్రేన్ తెగి క్రింద పడటంతో ఘోర ప్రమాదం
చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు అక్కడికక్కడే మరణించగా, శంకర్ సహా 10 మంది గాయపడ్డారు.

లైకా ప్రొడక్షన్ సంస్థపై వివిధ కేసులు.. వివరాలు
అయితే ఈ ఘటనపై చెన్నైలోని పూనమళ్లీ పోలీసులు లైకా ప్రొడక్షన్ సంస్థపై కేసు నమోదు చేశారు. నిర్మాతతో పాటు క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్‌పై కూడా కేసులు పెట్టారు. IPC సెక్షన్ 287, IPCసెక్షన్ 337, IPC సెక్షన్ 338,
IPC సెక్షన్ 304ఎ కింద వివిధ కేసులు నమోదు చేసినట్టు చెన్నై పోలీసులు తెలిపారు.

ఊహించని ప్రమాదం.. ఉలిక్కిపడిన ఇండస్ట్రీ
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఊహించని రీతిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద ఘటనపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కమల్ హాసన్ స్వయంగా మృతిచెందిన వారికి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

కమల్ కన్నీరు.. తృటిలో బయటపడిన హీరో హీరోయిన్స్
ప్రమాద విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కమల్ హాసన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల కమల్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు తాను ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డానని చెప్పారు. మరోవైపు కాజల్ కూడా వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొంది.


భారతీయుడు 2 మూవీ
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 మూవీ రూపొందుతోంది. చిరంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు.