కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్‌పై పోలీసులకు ఫిర్యాదు

తాజాగా ఈ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా అతనిపై ఓ లాయర్ పోలీస్ ఫిర్యాదు చేసారు. అమర్యాదకరమైన సాహిత్యంతో కూడిన ఓ సాంగును అతను యూట్యూబులో పోస్టు చేసి తన సోషల్ నెట్కర్కింగు ద్వారా షేర్ చేయడమే ఇందుకు కారణం.
సెన్సార్ చేయని ఆ పాటను పోస్టు చేసిన అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలిన సదరు లాయర్ డిమాండ్ చేసారు. సదరు సాంగ్ వీడియో మహిళలను అవమానించే విధంగా, మతపరమైన భావాలను కించపరిచే విధంగా ఉందని ఫిర్యాదు దారుడు ఎస్.జేబదాస్ పేర్కొన్నారు. వెంటనే ఆ వీడియో రిమూవ్ చేసి అనిరుధ్ రవించంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ సంగతి పక్కన పెడితే...అనిరుధ్ తనను మోసం చేశాడని వరుణ్ మణియన్ అనే నిర్మాత ఆరోపించారు. ప్రస్తుతం తను నిర్మిస్తున్న 'వాయై మూడి పేసవుమ్' అనే చిత్రానికి పాటలివ్వడానికి అనిరుధ్ ఒప్పుకున్నాడని, అతనికి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని వరుణ్ మణియన్ పేర్కొన్నారు. కానీ, అనిరుధ్ పాటలివ్వలేదని, దాంతో వేరే సంగీతదర్శకుణ్ణి పెట్టుకున్నానని ఆయన తెలిపారు. అనిరుధ్ అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వలేదని, అతనిపై చర్య తీసుకోవాలని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు వరుణ్ మణియన్.


Click it and Unblock the Notifications