twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీంనగర్‌లో 'తుపాకి' పోస్టర్‌పై ఆగ్రహం..పోలీస్ కంప్లైంట్

    By Srikanya
    |

    కరీంనగర్‌ : విజయ్ తాజా చిత్రం తుపాకీ కి తమిళనాడులో ముస్లింల నుంచి ప్రతిఘటన ఎదురైతే ఆంధ్రాలో మరో విధంగా నిరసన వ్యక్త మవుతోంది. మహిళలంతా సిగ్గుపడే రీతిలో 'తుపాకి' సినిమా పోస్టర్‌ లు ఉన్నాయంటూ వివాదం మొదలైంది. ఈ పోస్టర్స్ ను కరీంనగర్‌ పట్టణంలో ప్రదర్శించడంపై 'ది ఇండియన్‌ యూత్‌ సెక్యూర్డ్‌ ఆర్గనైజేషన్‌' (ఐవైఎస్‌ఓ) అనే స్వచ్ఛంద సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    తుపాకీ చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీ నటులను, జిల్లా కేంద్రంలో ఈ సినిమా పోస్టర్‌ అతికించిన సదరు సినిమా థియేటర్‌ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలంటూ ఈ ఐవైఎస్‌ఓ ప్రతినిధులు ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో ఎవరి అనుమతీ తీసుకోకుండా ఆయా నివాసాలు, విద్యా సంస్థల గోడలపైన, చివరికి ఆలయాల గోడలను కూడా విడిచిపెట్టకుండా అసభ్యకరంగా ఉన్న 'తుపాకి' సినిమా పోస్టర్లను అతికించారని పోలీసులకు ఐవైఎస్‌ఓ సభ్యులు ఫిర్యాదు చేశారు.

    అశ్లీల చిత్రాలున్న ఇలాంటి పోస్టర్ల వల్ల నేటి తరాలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, అమాయక బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడేలా ప్రేరేపిస్తాయని ఐవైఎస్‌ఓ మండిపడింది. ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని నిప్పులు చెరిగింది. తమిళ హీరో విజయ్‌, నటి కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించారు.

    English summary
    IYSO Team INDIA appeal to register the case immediately and take severe action on concerned Telugu Film “TUPAKI” Director, Producer, Actor, Actress and concerned local cinema theatre, who stick the objectionable poster, which hurts the pride of every WOMEN in our country, regarding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X