twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమండ్రి దుర్ఘటన: బోయపాటి శ్రీను పై పోలీసు కేసు నమోదు

    By Srikanya
    |

    హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై అమలాపురం మాజీ ఎంపి జీవి హర్షకుమార్ కుమారుడు జీవి శ్రీరాజ్ త్రీ టౌన్ పోలీ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. పుష్కరాలు ప్రారంభం రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీయటమే తొక్కిసలాటకు కారణం అని, తమ పాపులారిటీని పెంచుకునేందుకు పుష్కరాలను చంద్రబాబు ఉపయోగించుకున్నారని శ్రీరామ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

    షార్ట్ ఫిలిం రూపకల్పనకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారని, షార్ట్ ఫిల్మ్ మిషతో ఆయన అనధికార అడ్మినిస్ట్రేటర్ గా వ్యవరించారని తెలిపారు. పుష్కర ప్రారంభోత్సవంతో బోయపాటికి శ్రీనివాస్ కు ఏ సంభంధం లేనప్పటికీ , తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా వ్యవరించారని అన్నారు. ఆయనకు ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ, ప్రొటోకాల్ వ్యవహారంతో ఎటువంటి అనుభవమూ లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. బోయపాటి శ్రీను అనధికార నిర్వహణలో పుష్కరాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణకు రెండున్నర గంటలు పాటు స్నాన ఘట్టాలు చిత్రీకరించారని అన్నారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీనివాస్ ప్రజలను వదలండని చెప్పడంతో ప్రజనలను అధికారులు ఒకేసారి ఘాట్ లోకి వదిలారని అన్నారు. దీనివల్లనే 29 మంది మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటనకు భాధ్యులైన చంద్రబాబు నాయుడు, బోయపాటి శ్రీనివాస్ లపైన ఆయన ఆదేశాలు పాటించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కలెక్టర్ రాజమండ్రి అర్బన్ ఎస్పీలపై న్యాయ విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఇక రెండు రోజుల క్రితం...

    జరిగి ప్రాణ నష్టం సంభవించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని...అదీ...బోయపాటి శ్రీను దర్శకత్వంలో చంద్రబాబు సినిమా షూటింగ్ జరిపారని, దాంతో ఆలస్యం జరిగి తొక్కిసలాట జరిగిందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై దర్శకుడు బోయపాటి శ్రీను ఖండించారు. సాక్షి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అవన్నీ అర్దం లేని ఆరోపణలు అన్నారు.

    Police Complinat registar on Boyapati Seenu

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ... నేను సినిమా దర్శకుడుని కాబట్టి రంగుల్ని ఎలా ప్రెజెంట్ చెయాలన్నది పూర్తి అవగాహన ఉంది. పుష్కర ఘాట్లో హారతి మరింత బ్రైట్ గా ఉండేలా చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఆ భాధ్యత అప్పగించారు. దీని వల్ల దేశం నలు మూలల నుంచి వస్తున్న యాత్రికులు హారతి చూసి గొప్ప అనుభూతి పొందుతున్నారు. నేను జూలై 12 న పుష్కర ఘాట్ కు వెళ్లాను.

    పరిసరాల్ని గమనించే ఏం చేయాలో ఆలోచించాను. అదికారుల సహకారంతో స్ధానికంగా ఉన్న దుకాణాలు నుంచి కావాల్సిన వస్తువుల కొన్నాం. గుంటూరు నుంచి గొడుగులు తెప్పించాం హారతి అద్బుతంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఈ ఏర్పాట్లు చూసి భక్తులు ఆనందించాలన్నదే మా ఉద్దేశ్యం. చంద్రబాబు గారు నాకు చెప్పింది అదే.

    14వ తారీఖు డాక్యుమెంటరీ తీయటం లాంటిదేమీ జరగలేదు. నిజానికి నాకు డాక్యుమెంటరీ తీసేంత టైం లేదు. నా పని హారతి బాగా వచ్చేలా చేయటం వరకే. జులై 13 రాత్రి నా పని పూర్తయ్యింది. 14న ఉదయం ఏడున్నరకు గౌతమి ఘాట్లో పుష్కర స్నానం చేసి హైదరబాద్ కు బయిలుదేరిపోయాను అని బోయపాటి చెప్పారు.

    సోషల్ మీడియాలో గురువారంనాటి నుంచి ఈ ఫొటోతో కూడిన వ్యాఖ్యలు హల్‌చల్ చేస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లఘు చిత్రం కోసం గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానం చేస్తూ లఘు చిత్రం తీస్తున్నట్లు ఉన్న ఫొటో అది. చంద్రబాబు ప్రత్యర్థులు ఆ ఫొటోను షేర్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనిపై వివరణ రావటంతో మారుతుందని భావిస్తున్నారు.

    గోదావరి పుష్కరాలను మహా కుంభమేళాకు దీటుగా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం పొందాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నారని, ఈ మేరకు పుష్కర స్నానాలప్రారంభం, సిఎం కుటుంబ సభ్యులు పుణ్య స్నానాలు, లక్షలాది భక్తుల హాజరు, ఘాట్లలో హడావిడి అన్ని కలిపి ఓ డాక్యుమెంటరీ తీసి విదేశీ ప్రతినిధులకు చూపించి ఖ్యాతి పొందాలని చంద్రబాబు భావించారని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

    English summary
    Amalapuram Polce registered a Police Compliant against Director Boyapati Srinu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X