»   » భధ్రత మధ్య మీరా జాస్మిన్ వివాహం (ఫోటోలు)

భధ్రత మధ్య మీరా జాస్మిన్ వివాహం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ,తెలుగు,మళయాళి భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మలయాళీ కుట్టీ 'మీరా జాస్మిన్' వివాహం చేసుకుంది. 2014 ఫిబ్రవరి 12 వ తేదీన తిరువనంతపురంలోని పాలయం కోట్టయ్ లో గల ఎల్ఎంఎస్ చర్చిలో జరిగింది. మీరా జాస్మిన్ దుబాయ్ కి చెందిన అనిల్ టైటస్ అనే ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. ఈ వివాహం పోలీసుల భధ్రత మధ్య సింపుల్ గా జరిగింది.

వీరి పెళ్లిని ఎర్నాకులం రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ కూడా చేసారు. అలాగే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అది కూడా పెళ్లి సంబందాలు చూసే ఓ ఫేమస్ వెబ్ సైట్ ద్వారా ఈ పెళ్లి కుదిరినట్టు సమాచారం.

పెళ్లి కొడుకు అనీల్‌ జాన్‌ తిరువనంతపురానికి చెందిన వ్యక్తి. దుబాయిలో వర్క్‌ చేస్తున్నాడు. వివాహానంతంర దుబాయిలో సెటిల్ కానుందని సమాచారం. ఈ వివాహం ఆమె కుటుంబసభ్యులు,అత్యంత సన్నిహితుల సమక్షంలో క్త్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్పిడితో జరిగింది.

వివాహ ఫోటోలు...స్లైడ్ షో లో

వివాదం..మీరాని బెదిరించారు

వివాదం..మీరాని బెదిరించారు

గతంలో వరుడు అనీల్ ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.దాంతో ప్రస్తుతం ఆ యువతి,ఆమె తండ్రి ఈ వివాహం ఆపు చేయాలని ప్రయత్నించి రచ్చ చేయాలని చూసారు. వరుడు గతంలో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి...ఈ వివాహం మానుకోమని మీరా జాస్మిన్ బెదిరించారు. అయినా మీరా జాస్మిన్ వీటిని లెక్క చేయక అక్షింతలు వేయించుకున్నారు.

పిటీషన్ వేసారు...

పిటీషన్ వేసారు...

వరుడు అనిల్ జాన్ వేసిన పిటీషన్ మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తన మాజీ స్నేహితురాలు నవ్య నటరాజన్ తమ పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అనిల్ జాన్ తన పిటీషన్లో పేర్కొన్నారు. బెదిరింపులు: టెక్కీ హీరోయిన్ మీరా జాస్మిన్ పెళ్లి మీరా జాస్మిన్ గతంలో నవ్య, తాను పెళ్లి చేసుకోవాలనుకున్నామని....కానీ అనుకోని కారణాల వల్ల జరుగలేదని తెలిపారు. అయితే నవ్యతో పాటు, ఆమె తండ్రి ఇపుడు తమ పెళ్లిని అడ్డుకోవాలని చూస్తున్నాడరని, జనవరి 23న మీరా జాస్మిన్ ఇంటికి వెళ్లి పెళ్లిని అడ్డుకుంటామని బెదిరించారని....అనిల్ జాన్ వెల్లడించారు.

పోలీసులు అండతో...

పోలీసులు అండతో...

ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ హైకోర్టు మీరా జాస్మిన్-అనిల్ జాన్ వివాహానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దాంతో ఆమె పోలీసుల అండంతో వివాహం చేసుకుంది.

ఇద్దరూ ఇష్టపడే...

ఇద్దరూ ఇష్టపడే...

ఈ వివాహం మాట్రిమోనీ డాట్ కాం ద్వారా నిశ్చయమైనా వీరిద్దరూ పెళ్లికు ముందు కలుసుకుని చర్చించుకుని,ఇష్టపడే చేసుకుంటున్నట్లు కుటుంబ సబ్యులు తెలిపారు.

ఆమె అభిమాని

ఆమె అభిమాని

వివాహానికి ముందు నుంచే పెళ్లి కొడుకు మీరా జాస్మిన్ అభిమాని అని చెప్తున్నారు. ఆమె ను వివాహం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందంటున్నాడు. వివాహానికి ముందు ఆమె సినిమాలన్ని తెప్పించుకుని కంటిన్యూగా చూసి ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు పెళ్లి కొడుకు. దాంతో తనను ఇష్టపడే వ్యక్తి భార్య కావటం ఆనందంగా మీరా జాస్మిన్ భావిస్తోందని మళయాళ మీడియా అంటోంది.

రాజేష్ తో ప్రేమ...

రాజేష్ తో ప్రేమ...

మీరా ఇదివరకు మాండలీన్ శ్రీనివాస్ సోదరుడు రాజేశ్‌తో ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు.తమిళ హీర మాండలిన్‌ రాజేష్‌ను తాను ప్రేమిస్తున్నట్టు ఆమే స్వయంగా తెలిపారు. పెళ్లి గురించి త్వరలోనే ఓ ప్రకటన చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మీరా ప్రకటనతో కొంత కాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారనే ప్రచారపై స్పష్టత వచ్చిందనుకున్నారు. కానీ ఇలా వివాహంతో వాటిన్నటికి చెక్ చెప్పింది.

రన్ తో మెదలెట్టింది..

రన్ తో మెదలెట్టింది..

మీరా జాస్మిన్ ఇప్పటి వరకు సౌతిండియాలో అన్ని భాషలలో నటించింది. 'రన్" అనే తమిళ సినిమాని తెలుగు డబ్బింగ్ తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన మీరా తర్వాత తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలతో చేసింది.

పెళ్లితో నటనకు ఫుల్ స్టాప్

పెళ్లితో నటనకు ఫుల్ స్టాప్

తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్‌, భద్ర, మహారథి, రారాజు, యమగోల మళ్ళీ మొదలెైంది, గోరింటాకు చిత్రాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ... తర్వాత మెల్లిగా ఫేడవుట్ అయిపోయింది. ఈ వివాహంతో ఆమె నటనకు ఫుల్ స్టాఫ్ పెడుతుందని భావిస్తున్నారు.

వెనక పడి..

వెనక పడి..

జనరేషన్ మారుతుండడంతో కుర్ర హీరొయిన్లతో పోటీ పడలేక వెనుక పడిపోయింది మీరా. ఎలాగు సినిమా చాన్సులు లేవు కానుగ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటోందని చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి.

10

అవార్డుల నటి...

అవార్డుల నటి...

2004లో మలయాళీ చిత్రం 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'లో ప్రదర్శించిన నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు పొందింది. మీరా తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు, మహారథి, ఆఆఇఈ, ఆకాశ రామన్న, మోక్ష వంటి చిత్రాల్లో నటించింది.

రిలీజ్ ఆగిపోయింది

రిలీజ్ ఆగిపోయింది

ఎన్నో రోజులు క్రితం పూర్తయినా విడుదలకు నోచుకుని మీరా జాస్మిన్ చిత్రం మోక్ష. మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్నఈ 'మోక్ష' చిత్రం ఓ హర్రర్. 'బ్లాక్‌ అండ్‌ వైట్‌' చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ వేములపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

వివాహ శుభాకాంక్షలు....

వివాహ శుభాకాంక్షలు....

మీరా జాస్మిన్ కి వన్ ఇండియా తెలుగు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఆమె తెలుగు పరిశ్రమ నుంచి కూడా ఎంతో మంది విషెష్ తెలియచేస్తున్నారు. త్వరలోనే తన సన్నిహితులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది.

English summary
The marriage function of south indian actress Meera Jasmine (Jasmine Mary Joseph.) and Anil John Titus who is working as Software engineer at Dubai was held on Wednesday 12 February 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu