»   »  ఓ వైపు డ్రగ్స్ కేసు కలకలం: రామానాయుడు స్టూడియోకు పోలీసులు!

ఓ వైపు డ్రగ్స్ కేసు కలకలం: రామానాయుడు స్టూడియోకు పోలీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర సీమలో కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వాడినట్లు అనుమానాలు ఉండటంతో రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, తనీష్, ముమైత్ ఖాన్ లాంటి స్టార్లను పిలిపించి పోలీసులు విచారించారు.

పోలీసులు 12 మంది టాలీవుడ్ స్టార్లకు నోటీసులు పంపినా.... ఇంకా బయటకు రాని పేర్లు చాలా ఉన్నాయని, అందులో బడా నిర్మాతల కొడుకులు, ఇంకొందరు స్టార్స్ ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రామానాయుడు స్టూడియోకు ఎక్సైజ్ పోలీసులు రావడం చర్చనీయాంశం అయింది.

రామానాయుడు స్టూడియోకు పోలీసులు ఎందుకొచ్చినట్లు?

రామానాయుడు స్టూడియోకు పోలీసులు ఎందుకొచ్చినట్లు?

డ్రగ్స్ కేసు వ్యవహారం నేపథ్యంలో కొన్ని రోజులుగా విదేశాల నుండి వచ్చిన పార్సిల్స్ మీద ఎక్సైజ్ అధికారులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. ఈ క్ర‌మంలో విదేశాల నుండి రామానాయుడు స్టూడియోకి పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ పరిశీలించేందుకు వెళ్ళారు.

Ravi Teja Hints Some One Names And Hides Some names
అసలు ఏం పార్శిల్ వచ్చింది?

అసలు ఏం పార్శిల్ వచ్చింది?

ఎక్సైజ్ సీఐ రామానాయుడు స్టూడియోకు వచ్చిన నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు స్పందించారు. వెన్ను నొప్పిని త‌గ్గించేందుకు రానా ఓ పరిక‌రాన్ని విదేశాల నుండి తెప్పించుకున్నాడు. అది ప‌రిశీలించ‌డానికే ఎక్సైజ్ అధికారులు స్టూడియోకి వ‌చ్చార‌ని తెలియ‌జేశారు.

రానా, అభిరామ్ పేరు రావడంపై

రానా, అభిరామ్ పేరు రావడంపై

కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసు వ్యవహారంలో రానా, అభిరామ్ పేర్లు వార్తలు వినిపించాయి. అపుడు వెంటనే సురేష్ బాబు స్పందించారు. తన కొడుకులకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, మమ్మల్ని ఇందులోకి లాగొద్దని కోరారు.

కావాలనే

కావాలనే

ఓ సెక్షన్ మీడియా కావాలనే నా కుమారులు రానా, అభిరామ్ ను డ్రగ్స్ వివాదంలోకి లాగుతోంది. మాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదు. మాకు ఎవరూ కాల్ కూడా చేయలేదు. మా కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికి ఈ వివాదంతో సంబంధం లేదు అని సురేష్ బాబు వివరణ ఇచ్చారు.

English summary
Police inspection at Ramanaidu Studios. Recently a parcel came from abroad to Ramanaidu studio. The police carried out this inspection due to the drugs case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu