»   » బెదిరింపులు: టెక్కీ హీరోయిన్ మీరా జాస్మిన్ పెళ్లి

బెదిరింపులు: టెక్కీ హీరోయిన్ మీరా జాస్మిన్ పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుడుంబా శంకర్, భద్ర, పందెం కోడి తదితర తెలుగు చిత్రాల్లో నటించిన మళయాలి భామ మీరా జాస్మిన్ వివాహం నేడు (ఫిబ్రవరి 12) పాలయంలోని చర్చిలో జరుగనుంది. అనిల్ జాన్ టిటుస్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ పెళ్లాడబోతోంది. మాట్రిమోనీ సైట్ ద్వారా వీరి పెళ్లి సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది. వరుడు ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేసి దుబాయ్‌లో పని చేస్తున్నాడు.

కాగా...మీరా జాస్మిన్-అనిల్ జాన్ వివాహానికి భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. వరుడు అనిల్ జాన్ వేసిన పిటీషన్ మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తన మాజీ స్నేహితురాలు నవ్య నటరాజన్ తమ పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అనిల్ జాన్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

గతంలో నవ్య, తాను పెళ్లి చేసుకోవాలనుకున్నామని....కానీ అనుకోని కారణాల వల్ల జరుగలేదని తెలిపారు. అయితే నవ్యతో పాటు, ఆమె తండ్రి ఇపుడు తమ పెళ్లిని అడ్డుకోవాలని చూస్తున్నాడరని, జనవరి 23న మీరా జాస్మిన్ ఇంటికి వెళ్లి పెళ్లిని అడ్డుకుంటామని బెదిరించారని....అనిల్ జాన్ వెల్లడించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ హైకోర్టు మీరా జాస్మిన్-అనిల్ జాన్ వివాహానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. 2001లో ఓ మళయాల సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన మారా జాస్మిన్ తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'రన్' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా బిజీగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న పలు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉంది.

English summary
A Division Bench of the Kerala High Court on Tuesday directed the police to ensure that no law-and-order problem takes place during the solemnisation of the marriage of actor Meera Jasmine with Anil John Titus at a church in Thiruvananthapuram on February 12.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu