»   »  మందేసి చిందేస్తూ రేవ్ పార్టీ: హీరో నవదీప్ ఫాంహౌజ్‌పై పోలీసుల దాడి

మందేసి చిందేస్తూ రేవ్ పార్టీ: హీరో నవదీప్ ఫాంహౌజ్‌పై పోలీసుల దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

వికారాబాద్‌: టాలీవుడ్ యువ హీరో నవదీప్‌ కు చెంది ఫాంహౌస్‌పై పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేసినట్లు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ సమీపంలో ఉన్న ఈ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని, పలువురు సినీ ప్రముఖులు ఇందులో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే పోలీసులు దాడి చేస్తున్న విషయం ముందుగానే లీక్ కావడంతో....నవదీప్ తో పాటు సినీ ప్రముఖులంతా అక్కడి నుండి పరారయినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడే ఉన్న పార్టీ ఈ వెంట్ మేనేజర్ సాయి అరుణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫాంహౌస్ ను తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

Police raid at Hero Navadeep's Farm House

ఈ దాడిలో పోలీసులు 20 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫాంహౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి కొందరు సినీ ప్రముఖులు అనుమతి లేకుండా మద్యం తాగుతూ డ్యాన్సర్లతో నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

మోమిన్‌పేట్‌ సీఐ రంగా, మర్మపల్లి ఎక్సైజ్‌ అధికారులు సిబ్బందితో కలిసి ఫాంహౌస్‌పై దాడిచేశారు. అప్పటికే అక్కడున్న ప్రముఖలంతా తప్పించుకున్నారు. ఫాంహౌస్‌ మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని, 20 విదేశీ, స్వదేశీ మమద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Police and Excise officials conducted a joint raid at the farm house of Tollywood actor Navdeep and reportedly found the attendees indulging in obscene acts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu