»   » మోడీకి ఓ సలహా పడేసింది... ప్రధాని కి పూజా హెగ్డే సూచన ఏమిటంటే

మోడీకి ఓ సలహా పడేసింది... ప్రధాని కి పూజా హెగ్డే సూచన ఏమిటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకటే కామన్ టాపిక్. పెద్ద నోట్ల రద్దు. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమైయింది. ఇప్పుడు సర్వత్ర ఇదే అంశంపై జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ విషయంలో హీరోయిన్ పూజా హెగ్డే , ప్రధాని మోడీకి ఓ సలహా ఇచ్చంది. బ్లాక్ మనీని కొందరు లెక్కలు అప్పగించలేక కాల్చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. దీనిపై మాట్లాడిన పూజ వృథాగా పోవడం కన్నా దాన్ని ఓ మంచి కోసం ఉపయోగించడం మేలు కదా! అని జాలి మనసును చూపించింది.

పెద్ద నోట్లనుఇ రద్దు చేయటం తో ఇప్పుడు తమ వద్ద నున్న నల్లధనాన్ని ఏమీ చేయలేక.. ఆ నోట్లను మంటలకు ఆహుతి చేసే వారు కొందరైతే.. నల్లధనాన్ని కార్లలోంచి విసిరేస్తూ, నదుల్లో కట్తలకొద్దీ నోట్లను విసిరేస్తూ. ఇలా అనేకమంది తమ వద్ద నల్లధనం ఉందనే విషయం బయటికి తెలిస్తే.. లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అందుకే వాటిని ఎలాగోలా వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

Pooja Hedge offers Free Advice to Modi

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి కథానాయిక పూజా హెగ్డే ఓ సలహా ఇచ్చారు. నల్లధనం వృధాగా పోవడం కన్నా దాన్ని ఓ మంచి కోసం ఉపయోగించడం మేలు కదా అంటూ పూజా హెగ్డే వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, 'ప్రధాని నరేంద్రమోదీకి ఇది కేవలం ఒక సలహా మాత్రమే.. 2017 మార్చి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా రూ.500, రూ. 1000 నోట్లను డొనేషన్స్‌గా తీసుకుంటే నల్లధనం కనీసం ఓ మంచి పనికి ఉపయోగపడుతుంది అని సలహా ఇచ్చేసింది.

ఈమేరకు ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీకి ఇది కేవలం ఒక సలహా మాత్రమే.. 2017 మార్చి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా రూ.500, రూ. 1000 నోట్లను డొనేషన్స్ గా తీసుకుంటే నల్లధనం కనీసం ఓ మంచి పనికి ఉపయోగపడుతుంది, డబ్బును వృథా చేయడం కన్నా జనాలు దాన్ని విరాళంగా ఇస్తే.. రోగుల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది.ఈ సందేశం నరేంద్ర మోడీకి చేరుతుందని ఆశిస్తున్నా అని చెప్పింది పూజా

English summary
Pooja Hegde suggested that the government hospitals should take donations of Rs 1000 and Rs 500 notes. “Narendramodi If Govt hospitals can take donations of 500 & 1000 notes up till March 2017, at least the black money gets put to good use. Instead of money getting wasted,ppl might donate,healthcare will improve. Just a suggestion narendramodi,” she tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu