»   » డెంగ్యూతో బాధపడుతున్న హీరోయిన్, అందుకే ప్రమోషన్స్ కు నో

డెంగ్యూతో బాధపడుతున్న హీరోయిన్, అందుకే ప్రమోషన్స్ కు నో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్స్ కు అయినా సామాన్యులకు అయినా రోగాలు, రొష్టులు తప్పవు. అయితే ప్రొఫెషినల్ గా పీక్స్ కు వెళ్లే సమయంలో ఇవి కాస్త ఇబ్బంది పెడతాయి. తాజాగా అలాంటి సమస్యే ఎదురైంది పూజా హెడ్గేకు. పూజా హెడ్గే అంటే గుర్తు వచ్చిందా. అప్పట్లో జీవా సరసన మాస్క్, ఇంకా చెప్పాలంటే ముకుంద చిత్రంలో వరుణ్ తేజ ప్రక్కన చేసిందే ఆమె. అరెరే..ఆమెకా..ఏమైంది అంటారా..

గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌ నటి పూజాహెగ్దే అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో పూజా వైద్య పరీక్షలు నిర్వహించుకోగా డెంగ్యూ సోకినట్లు వైద్యులు చెప్పారు. పూజా తన తదుపరి చిత్రం మొహెంజొదారో చిత్ర ప్రచార కార్యక్రమాలకి హాజరుకాలేకపోతోంది.

పూజాకు బాలేదని తెలీడంతో చిత్ర యూనిట్ కూడా ఆమెకు సహకరిస్తున్నారని పూజా సన్నిహితులు తెలిపారు. అప్పటివరకు చిత్ర ప్రచార కార్యక్రమాలకు దర్శకుడు అషుతోష్‌, హృతిక్‌లు హాజరవుతుంటారు. ఆగస్ట్‌12న ఈ చిత్రంప్రేక్షకుల ముందుకు రానుంది.

పూజ హెడ్గే గురించి మరిన్ని విశేషాలు.... స్లైడ్ షోలో

సెకండ్ రన్నర్ అప్

సెకండ్ రన్నర్ అప్

పూజ హెడ్గే... 2010 మిస్ యూనివర్స్ పోటీలో సెకండ్ రన్నర్ అప్ గా ఎంపికైంది.

తొలి చిత్రం

తొలి చిత్రం

మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన మాస్క్ (జీవా హీరో)తో ఆమె తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ఫ్లాఫైంది.

తెలుగులో తొలిసారి

తెలుగులో తొలిసారి

ఆ తర్వాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం చిత్రం చేసింది. ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

వరుణ్ తేజ ప్రక్కన

వరుణ్ తేజ ప్రక్కన

వరుణ్ తేజ, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఫ్లాఫైంది.

ఇప్పుడు

ఇప్పుడు

లగాన్ దర్శకుడు అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మొహంజదారో చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది.

వచ్చినట్లే వచ్చి

వచ్చినట్లే వచ్చి

మణిరత్నం చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయింది.

గ్యాప్

గ్యాప్

తన బాలీవుడ్ చిత్రం రిలీజ్ అయ్యేదాకా రీజనల్ లాంగ్వేజ్ చిత్రాలు చేయనని ప్రకటించింది.

ఎఫైర్

ఎఫైర్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో ఆమె ఎఫైర్ నడుపుతోందంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఏరియల్ డాన్స్...

ఏరియల్ డాన్స్...

పూజ గత కొద్ది రోజులుగా ఏరియల్ డాన్స్ ప్రాక్టీస్ లో యమ బిజీగా ఉంటోందట... గ్రామీ అవార్డ్స్ లో పింక్ ఏరియల్ డాన్స్ చూసి ఫిదా అయిన పూజ ముంబైలో ఆ డాన్స్ నేర్పే వారిని పట్టుకుని ప్రాక్టీస్ మొదలెట్టిందట.

భయం..ఆశ్యర్యం

భయం..ఆశ్యర్యం

వేదిక మీదకు వెళ్లాలంటే భయం. ఒకవేళ వెళ్లినా... నేను చెప్పాలనుకున్నదీ, చేయాలనుకున్నదీ కంగారులో మర్చిపోయి సిగ్గుతో కిందకు వచ్చేదాన్ని. అలాంటి నేను వెండి తెర మీద కనిపిస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.

English summary
Pooja Hegde is making her debut in Hrithik Roshan’s next, ‘Mohenjo Daro’. Hegde had been feeling unwell for a few days and, having undertaken some tests, finally received a diagosis, she is being diagnosed with dengue, it seems she will be unable to be a part of the film’s promotions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu