»   » హీరోయిన్‌ను ఆ కాలనీ నుండి గెంటేస్తూ తీర్మాణం!

హీరోయిన్‌ను ఆ కాలనీ నుండి గెంటేస్తూ తీర్మాణం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మాజీ ‘బిగ్ బాస్' కంటెస్టెంట్, వివాదాస్పద మోడల్ పూజ మిశ్రా మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. పూజా మిశ్రా 'న్యూసెన్స్' క్రియేట్ చేస్తుందని ఆరోపిస్తూ.... ముంబైలోని లోఖండ్ వాలా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ సొసైటీ సభ్యులు ఆమెను ఆపార్టుమెంటు నుండి బహిష్కరించారు.

ఇక్కడి విండ్ సార్ టవర్ లో పూజా మిశ్రా కుటుంబం నివసిస్తోంది. అయితే ఆమె తల్లదండ్రులు ఉండొచ్చు కానీ... ఆమె ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని సొసైటీ సభ్యులు తీర్మానించారు. ఆమె ప్రవర్తన సక్రమంగా ఉండదని, ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతుందని, తన కెరీర్ ఎదగనీయకుండా క్షుద్రపూజలు చేయించారని కొందరితో వాదనలకు దిగిందని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విధించిన కమిటీని కోర్టుకు లాగుతానని ఇప్పుడు పూజా హెచ్చరిస్తోంది. తన ఇంట్లోకి రాకుండా తననే నిషేధించడానికి వారెవరని ప్రశ్నించిన పూజ, తానే ఓ న్యాయవాదినని, తన తరఫున కోర్టులో తానే వాదించుకుంటానని చెబుతోంది.

Pooja Mishra boycotted by lokhandwala society

గత వివాదాలు...
పూజా మిశ్రాపై గతంలోనూ పలు వివాదాలు ఉన్నాయి. అప్పట్లో ఢిల్లీలోని కోరల్ భాగ్ ఏరియాలో ఓ స్టోర్ లో పూజా మిశ్రా వీరంగం సృష్టించింది. స్టోర్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు బూడుతు తిడుతూ రెచ్చిపోయింది. గతంలోనూ ఓ హోటల్ లో సిబ్బందితో పూజా మిశ్రా గొడవ పడిన సంగతి తెలిసిందే.

ఆ మధ్య ఓ క్యాలెండర్ ఫోటో షూట్ లో భాగంగా పూజా మిశ్రా ఉదయ్ పూర్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. డిన్నర్ తర్వాత డ్రింక్ తాగాను. తర్వాత మైకం కమ్మి నిద్రపోయాను. నిద్ర లేచిన తర్వాత లైంగిక దాడికి గురైనట్లు తెలిసింది' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వీరిని తనపైకి లైంగిక దాడికి ప్రేపించింది సోనాక్షి సిన్హా, ఆమె తల్లి పూనం, ఇషా కొపీకర్, వేణుగోపాల్ దూత్ అయి ఉండొచ్చని తన ఫిర్యాదులో పేర్కొనడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

2002లో ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన పూజా మిశ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. కెరీర్ తొలినాళ్లలో పూజా మిశ్రా మోడలింగ్ రంగంలో రాణించింది. అందచందాలతో ఆకట్టుకుంది. మోడలింగ్ చేసేప్పుడు వీడియోకాన్, ఫ్రూటి, రాయల్ పామ్స్, ఇండియ్ ఎక్స్ ప్రెస్, సన్ సూయ్, లిస్సమ్ మాయిశ్చరైజర్ తరుపున ప్రచారం చేసింది. 2003లో వచ్చిన దిల్ కా రిస్తా సినిమాలో ఐటం గర్ల్‌గా పూజా మిశ్రా బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘బాజా బజాదూంగా', ‘లవ్ ది వే ఐ యామ్' చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.

English summary
Bollywood actress Pooja Mishra boycotted by lokhandwala society.
Please Wait while comments are loading...