twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండేళ్లుగా నన్ను మానసికంగా... దారుణంగా.. పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు!

    |

    మానసిక క్షోభకు గురిచేస్తున్నాయంటూ పలు యూట్యూబ్ ఛానెళ్లపై నటి పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొద్దికాలంగా వాస్తవాలు తెలుసుకోకుండా నా గురించి చెడుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తన ఫిర్యాదును సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానెళ్ల కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

     పూనమ్ కౌర్ టార్గెట్

    పూనమ్ కౌర్ టార్గెట్

    గత కొద్దికాలంగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ను పూనమ్ కౌర్ టార్గెట్ చూసినట్టు ఓ ఆడియో ఫైల్ సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ ఆడియోలో పవన్ కల్యాణ్‌పై తీవ్రంగా ఆరోపణలు చేసినట్టు అనిపించాయి. ఆ వీడియోను పలువురు సెలబ్రిటీలు, వివాదాస్పద తారలు కూడా షేర్ చేయడంతో యూట్యూబ్ మీడియా కథనాలు అదుపుతప్పాయనే మాట వినిపించింది.

    యూట్యూబ్ కథనాలపై ఆగ్రహం

    యూట్యూబ్ కథనాలపై ఆగ్రహం

    యూ ట్యూబ్ వీడియోలు, కథనాలు నా ప్రతిష్టకు భంగం కలిగిసున్నాయి. వారు ప్రసారం చేసే వార్తలు, కథనాలు వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయి. దాదాపు 50 యూట్యూబ్ ఛానెళ్లు నాకు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యాను అని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    మానసికంగా కుంగిపోయాను

    మానసికంగా కుంగిపోయాను

    మహిళలపై ముఖ్యంగా సినీ తారలు, సెలబ్రిటీలపై ఇలాంటి కథనాలు ఎలా ప్రసారం చేస్తారు. ఏ మహిళ కూడా గురికాని విధంగా మానసికంగా కుంగిపోయాను. ఇక ఇలానే ఉపేక్షిస్తే నా ప్రతిష్టకు మరింత ముప్పు చేకూరే విధంగా ఉంది. అందుకే నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చాను. వారికి కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల జాబితాను కూడా అందజేశాను అని మీడియాకు వెల్లడించినట్టు సమాచారం.

    ఏపీ ఎన్నికలు ముగిసిన వెంటనే

    ఏపీ ఎన్నికలు ముగిసిన వెంటనే

    ఏపీ ఎన్నికల ముగిసిన వెంటనే పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేక సందేహాలకు దారి తీసింది. ఈ ఫిర్యాదు వెనుక ఎదైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానాన్ని దాట వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందున్న వారు తగిన రీతిలో దర్యాప్తు చేసి నాకు న్యాయం చేస్తారు అని భావిస్తున్నాను అని పూనమ్ కౌర్ అన్నారు.

    సోషల్ మీడియాలో పలువురిపై కామెంట్స్

    సోషల్ మీడియాలో పలువురిపై కామెంట్స్

    గతంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కత్తి మహేష్ లాంటి ప్రముఖులపై ట్విట్టర్‌లో పూనమ్ కౌర్ పదునైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని ట్వీట్లను కూడా ఆమె తొలగించారు. చాలా కాలంగా పవన్‌తో వివాదంపై మౌనం దాల్చిన పూనమ్ కౌర్ తాజాగా మళ్లీ తన గళాన్ని వినిపించడం మీడియాలో అటెన్షన్‌గా మారింది.

    English summary
    Actress Poonam Kaur has on Tuesday lodged a complaint with the cyber crime police in Hyderabad. She said, About 50 YouTube channels have been spreading canards against me. I have gone through so much trauma in the last 2 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X