నన్ను బలవంతంగా ప్రెగ్నెంట్ చేయొద్దు.. అలా అయితే స్వీట్లు పంచుతా.. పూనమ్ పాండే

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండేకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాల్లో కూరుకుపోయడం కొత్తేమీ కాదు. ఇటీవలే పెళ్లి చేసుకొన్న ఈ భామ ఏకంగా భర్తపై పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చి అరెస్ట్ చేయించడం తెలిసిందే. అయితే తాజాగా తాను ప్రెగ్నెంట్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఘాటుగా స్పందించింది... తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పూనమ్ పాండే ఏం చెప్పిందంటే...

గతేడాది లాక్‌డౌన్ తర్వాత

గతేడాది లాక్‌డౌన్ తర్వాత

ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత పూనమ్ పాండే అందరికీ షాకిస్తూ తన ప్రియుడు శామ్ బాంబేను వివాహం చేసుకొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ముంబైలోని బాంద్రాలో వివాహం చేసుకొని తన పెళ్లి వార్తను ఇన్స్‌టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. దాంతో అభిమానులు పెళ్లి చేసుకొన్న సమయంలో శుభాకాంక్షలు అందించారు.

హానిమూన్‌కు వెళ్లి భర్తపై కేసు

హానిమూన్‌కు వెళ్లి భర్తపై కేసు

పూనమ్ పాండే పెళ్లి చేసుకొని వివాదాలకు దూరంగా ఉంటారనుకొన్న వారికి మరోసారి షాక్ ఇచ్చారు. హానీమూన్ ట్రిప్‌కు గోవాకు వెళ్లిన పూనమ్ పాండే.. తన భర్త లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. కేసు నమోదు చేశారు. ఆయన శారీరక వేధింపుల కారణంగా పలు రోజులు హాస్పిటల్ పాలయ్యానని ఫిర్యాదులో ఆరోపించారు. అనంతరం వారిద్దరూ రాజీ పడి మళ్లీ ఒక్కటయ్యారు.

ఆరు వారాల గర్బవతి అంటూ

ఆరు వారాల గర్బవతి అంటూ

అయితే పూనమ్ పాండే ఆరు వారాల గర్బవతి అంటూ బాలీవుడ్ పత్రికల కథనాలు వెల్లడించాయి. దాంతో ఆమె ప్రెగ్నెన్సీ గురించి మీడియా ఆరా తీసింది. దాంతో చికాకు పడిన పూనమ్ పాండే బాలీవుడ్ పత్రికతో మాట్లాడుతూ..క్లారిటీ ఇచ్చారు. నా జీవితం తెరచిన పుస్తకం. దాంట్లో దాచాల్సిన అవసరం లేదు అంటూ పూనమ్ పాండే ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

బలవంతంగా నన్ను ప్రెగ్నెంట్ చేయకండి

బలవంతంగా నన్ను ప్రెగ్నెంట్ చేయకండి

పూనమ్ పాండే ప్రెగ్నెంట్ అని వార్తలు రాయకండి.. నన్ను బలవంతంగా గర్బవతిని చేయకండి. ఓ బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళ జీవితంలో అపురూపమైనది. అలాంటి విషయాన్ని అల్లరి పాలు చేయవద్దు. ఇలాంటి విషయాలు దాచుకొనేవి కాదు. అందుకే నేను ఈ విషయంపై మరింత రూమర్లు పాకడానికి ముందే వివరణ ఇస్తున్నాను అని పూనమ్ పాండే తెలిపారు.

Recommended Video

Liger Movie Team Planning For Surprise On Vijay Devarakonda Birthday || Filmibeat Telugu
ఏదైనా శుభవార్త ఉంటే స్వీట్లు పంచి..

ఏదైనా శుభవార్త ఉంటే స్వీట్లు పంచి..

పూనమ్ పాండే మీడియాలో వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ... నేను ప్రెగ్నెంట్‌ను కాదు. అలాంటి శుభవార్త ఏదైనా నా జీవితంలో ఉంటే.. నేను స్వీట్లు పంచి ఆనందంగా ఆ విషయాన్ని అందరికీ చేరవేస్తాను. అందులో దాపరికం ఏమీ ఉండదు అంటూ పూనమ్ పాండే వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X