»   » నాకు కడుపు అయిందని రాస్తారా? 100 కోట్లు ఇవ్వండి!

నాకు కడుపు అయిందని రాస్తారా? 100 కోట్లు ఇవ్వండి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సంచలన మోడల్, నటి పూనమ్ పాండే గురించి.... ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తాజాగా అమ్మడు తనపై వచ్చిన ఓ వార్తకు కస్సుబుస్సులాడుతోంది. ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ ద్వారా గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించుకుందంటూ ఓ బాలీవుడ్ వెబ్ సైట్ వార్త రాసింది.

ఈ వార్తపై మండి పడ్డ పూన్ పాండే.... తనపై ఆధారం లేని వార్త రాసిన సదరు వెబ్ సైట్ మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలిపిందే. సదరు వెబ్ సైట్ మీద రూ. 100 కోట్ల దావా వేయనున్నట్లు పూనమ్ పాండే వెల్లడించింది. తాను గర్భం దాల్చినట్లు ఫేక్ న్యూస్ రాసారు, ఎవరూ నమ్మొద్దు అంటోంది పూనమ్.

పూనమ్ పాండే హాట్ వీడియో

Poonam Pandey filed a Rs 100 crore defamation case

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.....‘నేను నా సినిమా షూటింగులో బిజీగా ఉన్నాను. ఈ వార్త విషయం విని షాకయ్యాను. చాలా డిస్ట్రబ్ అయ్యాను. వెంటనే మా మేనేజర్ కి చెప్పి ఈ విషయమై ఆరా తీసాను. ఆ వార్త రాసిన రిపోర్టర్ కి కూడా ఫోన్ చేసాను. ఏ ఆధారంతో ఈ వార్త రాసారని నిలదీసాను. ఆశ్చర్యకరంగా సదరు రిపోర్టర్ ఎలాంటి ప్రూప్ లేదని, ఎక్కడో ఇలాంటి వార్త విని రాసానని చెప్పారు. ఇలాంటి జర్నలిస్టులు కూడా ఉంటారా? అని ఆశ్చర్య వేసింది. మీ సర్క్యూలేషన్ కోసం మా జీవితాలతో ఆడుకుంటారా' అంటూ ఫైర్ అయింది పూనమ్.

ఈ విషయాన్ని నేను మామూలుగా వదిలి పెట్టేయదలుచుకోలేదే. అందుకే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను. ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం తగదు అని పూనమ్ పాండే చెప్పుకొచ్చింది.

English summary
Model-turned-Bollywood actress Poonam Pandey is fuming with anger over reports that said that she had undergone an abortion at one of the hospitals in Mumbai. The news about her abortion has been doing the rounds on many websites and the actress plans to take legal action.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu