»   » డబ్బుకు ఆశపడి...తాగుబోతులకు చిక్కిన పూనమ్

డబ్బుకు ఆశపడి...తాగుబోతులకు చిక్కిన పూనమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హాట్ బాంబ్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తాజాగా ఈ అమ్మడు తన జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొంది. ఇటీవల న్యూఇయర్ వేడుక సందర్భంగా బెంగుళూరులోని ఓ క్లబ్‌లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్న పూనమ్ పాండే‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది.

తనకు జరిగిన ఈ షాకింగ్ సంఘటన గురించి పూనమ్ పాండే మీడియాకు వివరించింది. 'భారీగా మొత్తంలో డబ్బులు ఆశ చూపడంతో టెంమ్ట్ అయ్యాను. బెంగుళూరులోని క్లబ్‌లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. కానీ ఎందుకు ఒప్పుకున్నానా ఆ తర్వాత బాధ పడ్డాను' అని పూనమ్ పాండే వెల్లడించింది.

'నా పెర్ఫార్మెన్స్ ముగిన అనంతరం అప్పటికే బాగా మధ్యం సేవించి ఉన్న పురుషుల సమూహం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నా పర్సనల్ బౌన్సర్లు 20 మంది, ఆర్గనైజర్లు ఏర్పాటు చేసిన 100 మంది గార్డులు ఉన్నా వారిని కంట్రోల్ చేయడం కష్టం అయింది. వారికి బయపడి పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది' అని పూనమ్ పాండే తెలిపింది.

ఇకపై ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లను. మసోసారి ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోను అంటూ......వ్యాఖ్యానించింది పూనమ్ పాండే. ఇంత కాలం ఇంటర్నెట్లో హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో యువతను రెచ్చగొట్టేలా ఫోటోలు పోస్టు చేయడం లాంటి చర్యలకు పాల్పడిన పూనమ్ పాండేకు.....అలాంటి చర్యల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురువతాయో ఈ సంఘటనతో తెలిసొచ్చినట్లైంది.

English summary

 Controversial model Poonam Pandey, who recently made her Bollywood debut with bold film "Nasha", has vowed never to perform at a New Year's Eve celebration after her nightmarish experience in Bangalore while performing at a posh club.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu