»   » శృంగార సీన్లు చేయడానికి సిగ్గు పడటం ఎందుకు?

శృంగార సీన్లు చేయడానికి సిగ్గు పడటం ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తత జనరేషన్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రధాన సాధనం సినిమా. సినిమా చూసే ప్రక్షకుల అందరి అభిరుచి ఒకేలా ఉండదు. యాక్షన్, డ్రామా, సెంటిమెంటు, కామెడీ, హారర్ లాంటి ఎలిమెంట్స్‌తో పాటు శృంగార సీన్లు కోరుకునే ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అందుకే దర్శకులు ఆయా సీన్లతో పాటు...శృంగార ప్రధానమైన సన్నివేశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు తమ సినిమాల్లో.

అయితే చాలా మంది నటీనటులు పలు ఇంటర్వ్యూల్లో శృంగార సీన్లు చేసేప్పుడు చాలా ఇబ్బంది ఫీలవుతుంటాం అని చెబుతుంటారు. అఫ్ కోర్స్.....వారి మనసులో వేరే ఆలోచన ఏమున్నప్పటికీ బయటకు మాత్రం అలానే చెబుతారు. మన సమాజంలో 'సెక్స్' పట్ల ఉన్న భావమే వారు అలా మాట్లడటానికి కారణం అయి ఉండొచ్చు.

కానీ వీరందరికీ భిన్నంగా...తన మనసులోని మాటలను ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది బాలీవుడ్ హాట్ లేడీ పూనమ్ పాండే. కెమెరా ముందు శృంగార సీన్లు చేయడానికి తాను ఎలాంటి ఇబ్బంది ఫీలవ్వనని తెగేసి చెప్పింది. పూనమ్ తన తొలి సినిమా 'నషా'లో కూడా శృంగార సీన్లు ఇరగదీసింది. ఆ సినిమా ప్లాపైనప్పటికీ ఆ సీన్లను మాత్రం ఆమె అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు.

పూనమ్ ఇలా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనక....సినిమా అవకాశాలు దక్కించుకోవాలనే మెగాప్లాన్ ఉందని పలువురి వాదన. కాగా....పూనమ్ ప్రస్తుతం ఐటం సాంగులపై దృష్టి సారించింది. కన్నడలో 'లవ్ పాయిజన్' అనే చిత్రంలో స్పెషల్ సాంగు చేసింది. ఈ సినిమాలో తన సాంగుకు మంచి పేరొస్తే....సౌత్‌లో ఐటం సాంగులు మరిన్ని దక్కించుకోవచ్చనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.

English summary

 While lovemaking scenes make an actress feel queasy and nervous, it was the other way around for starlet Poonam Pandey. "In fact, I thoroughly enjoyed it," she laughs. Poonam adds, "The scenes have been aesthetically shot and do not appear vulgar. They are sensuous and bold but not sleazy."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu