»   » సెక్స్ బాంబ్ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి...

సెక్స్ బాంబ్ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సెక్స్ బాంబ్ గా ముద్రపడ్డ పూనం పాండే వెబ్ సైట్ ని సోమవారం హ్యాక్ చేసారు. ఈ విషయాన్ని పూనం మీడియాకు తెలియచేసింది. కాశ్మీర్ కోసం మాట్లాడమంటూ ఆ హ్యాక్ చేసిన తర్వాత తన పేజీలో ఉందని ఆమె తెలియచేసింది. ఈ విషయమై ఆమె ముంబై సైబర్ క్రైమ్ సెల్ కి కంప్లైంట్ చేసింది. అలాగే ట్విట్టర్ లోనూ ఈ విషయమై పోస్ట్ చేసింది.

ఇక ఈ సంవత్సరం పూనం పాండేకు కలిసి వస్తున్నట్లు లేదు. బెంగుళూరులో జరిగిన ఓ సంఘటన ఆమెను ఇబ్బందిల్లోకి తోసింది. ఇటీవల న్యూఇయర్ వేడుక సందర్భంగా బెంగుళూరులోని ఓ క్లబ్‌లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్న పూనమ్ పాండే‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. తనకు జరిగిన ఈ షాకింగ్ సంఘటన గురించి పూనమ్ పాండే మీడియాకు వివరించింది. 'భారీగా మొత్తంలో డబ్బులు ఆశ చూపడంతో టెంమ్ట్ అయ్యాను. బెంగుళూరులోని క్లబ్‌లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. కానీ ఎందుకు ఒప్పుకున్నానా ఆ తర్వాత బాధ పడ్డాను' అని పూనమ్ పాండే వెల్లడించింది.

అలాగే రీసెంట్ గా పూనంపాండేకు ఆరో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన వారెంటుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఎన్‌.నాగమోహనదాస్‌ స్టే ఇచ్చారు. భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ గెల్చుకుంటే జట్టు ముందు తాను నగ్న ప్రదర్శన చేస్తానని ప్రకటించటంతో పాటు తన దుస్తులపై దేవతల చిత్రాలతో పూనంపాండే పలుమార్లు బహిరంగ ప్రదర్శనలు ఇవ్వటంపై న్యాయవాది ఉమేష్‌ ఆరో ఏసీఎంఎం కోర్టులో అర్జీ వేశారు. పలుమార్లు ఆమె విచారణకు గైర్హాజరయ్యారు.

జనవరి 10వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ విచారణకూ గైర్హాజరు కావటంతో ఫిబ్రవరి 12వ తేదీ నాటి విచారణకు పూనమ్‌ పాండేను హాజరు పరచాలంటూ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఆదేశాల్ని ప్రశ్నిస్తూ పూనమ్‌ పాండే తరపు న్యాయవాది హైకోర్టులో అర్జీ వేశారు. అర్జీను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చారు.

English summary
Poonam Pandey pressed the panic button on Monday morning after her website was allegedly hacked. A distressed Poonam tweeted, "Alert! Alert! Help Help ... My Website got Hacked & they have asked to raise Voice for Kashmir :(( Really upset! & Scared."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X