twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాడ్ స్క్రీన్‌ప్లే వల్లే ఈ సినిమాకు ఆ గతి : పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నిన్న (సోమవారం) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఓ ప్రెవేట్ రేడియో ఎఫ్ ఎమ్ ఛానెల్ వారు పవన్ కళ్యాణ్ తో గతంలో చేసిన ఇంటర్వూని ప్రసారం చేసారు. ఆ ఇంటర్వూలో పవన్ ...కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిన జానీ సినిమా ప్రస్దావన వచ్చింది. ఆ చిత్రం గురించి మాట్లాడుతూ..సరైన స్క్రిప్టు లేకపోవటం వల్లే సినిమా ప్లాప్ అయ్యిందని ఆయన చెప్పారు.

    పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ' జానీ ఫెయిల్యూర్ కి స్క్రీన్ ప్లే నే ప్రధాన కారణం. నేను అనుకున్న దాని అనుకున్నట్లు గా చెప్పడానికి నాకు ఓ మంచి రైటర్స్ టీం కావాలి. నాకు రైటింగ్ టాలెంట్ తక్కువ, అలాగే రైటింగ్ నుంచి మంచి సపోర్ట్ లేదు. దాని వల్ల జానీ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. జానీ మూవీకి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే లేదు 'అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    అలాగే మళ్ళీ దర్శకత్వం చేస్తారా అన్న ప్రశ్నకు... ' మంచి రైటర్స్ టీం దొరికితే, ఆడియన్స్ కి చెప్పడానికి మంచి కథ దొరికి, దానికి మంచి సరైన రైటింగ్ కుదిరిందని నాకు నమ్మకం కుదిరితే భవిషత్తులో డైరెక్ట్ చేస్తాను. కానీ నా నుండి వచ్చిన కథలని మాత్రమే నేను డైరెక్ట్ చేస్తాను. నేను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఎవరో బయటి వారి కథతో సినిమా చెయ్యను. బయటి వారి కథలకి నేను న్యాయం చెయ్యలేను. నాకు నేనుగా కథని ఫీల్ అవ్వాలి, నాకు నమ్మకం ఉండాలని' అని తేల్చి చెప్పారు.

    ఇక సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆందోళన కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యామిలీ సినిమాలను సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో విడుదల నిలిచి పోయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని సెప్టెంబర్ చివరలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న గానీ, సెప్టెంబర్ 27న కానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

    ఈచిత్రంలో నదియా... పవన్ కళ్యాణ్ పాత్ర అత్త లో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    “Screenplay is the issue. I need a good team of writers to support me and my vision. I have limited scripting capabilities and I did not have good writing support then. As a result, Johnny is very flat. It does not have interesting screenplay”, said Pawan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X