twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత.. షాక్‌లో సౌత్ ఇండస్ట్రీ

    |

    Recommended Video

    Popular Actress Geetanjali No More || షాక్‌లో సౌత్ ఇండస్ట్రీ

    ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆలరించిన ప్రముఖ నటి గీతాంజలి ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం తెల్లవారు జామున గుండెపోటుతో హైదరాబాద్ అపోలో హస్పిటల్‌లో కన్నుమూశారు. ఆమె మృతితో తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటిని కోల్పోయింది. గీతాంజలి మృతి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ సందర్భంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను స్మరించుకొంటున్నారు. వివరాల్లోకి వెళితే..

    గీతాంజలి వ్యక్తిగత జీవితం

    గీతాంజలి వ్యక్తిగత జీవితం


    గీతాంజలి 1957లో కాకినాడలో జన్మించారు. చిన్నతనంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. 1961లో స్వర్గీయ ఎన్టీఆర్‌తో సీతారామ కళ్యాణం చిత్రంతో చిత్ర సీమకు పరిచయం అయిన ఆమె పలు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నారు.

    గీతాంజలి నటించిన చిత్రాలు

    గీతాంజలి నటించిన చిత్రాలు

    గీతాంజలి ఇప్పటి వరకు 50 చిత్రాలకుపైగా నటించారు. మలయాళంలో మూడు, హిందీలో 5, తమిళంలో 13 చిత్రాల్లో నటించారు. ఎన్నాఆర్‌తో డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, అబ్బాయి గారు అమ్మాయి గారు, కాలం మారింది చిత్రాల్లో నటించారు. సంబరాలు రాంబాబు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టారు. పెళ్లైన కొత్తలో, గ్రీకు వీరుడు, భాయ్ చిత్రాల్లో కనిపించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం దటీజ్ మహాలక్ష్మీ. ఈ చిత్రం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.

    తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో

    తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో

    తమిళంలో డజనుకుపైగా చిత్రాల్లో నటించారు. శారద, దివాతీన్ దీవమ్, తాయిన్ మాదియిల్, మాయామణి, పానమ్ పడైతావన్ లాంటి చిత్రాల్లో నటించారు. హిందీలో పేయింగ్ గెస్ట్, పరాస్ మణి, దో కలియాన్, బలరాం శ్రీ కృష్ణ, బంధు చిత్రాల్లో నటించారు. మలయాళంలో కాట్టు మాల్లిక, స్వప్నాంగై, మధువీదు చిత్రాల్లో నటించారు.

    వైవాహిక జీవితం

    వైవాహిక జీవితం

    నటి గీతాంజలికి యాక్టర్ రామకృష్ణతో వివాహం జరిగింది. పెళ్లికి ముందు వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. రామకృష్ణ కూడా ప్రముఖు నటుడనే విషయం తెలిసిందే. ఆయన తెలుగు, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లో నటించారు. వీరిద్దరకి ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. భూమా అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.

    English summary
    Popular Actresss Geetanjali no more. She died in hyderabad appollo hospital. She acted Telugu, Tamil, Kannada, and Hindi movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X