»   » మళయాల సినీ ఇండస్ట్రీ లో కలకలం..., టాప్ హీరోయిన్ అరెస్టు

మళయాల సినీ ఇండస్ట్రీ లో కలకలం..., టాప్ హీరోయిన్ అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై దక్షిణాది సినిమాల నటి ధన్య మేరీ వర్గీస్‌, ఆమె భర్త జాన్ జాకబ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్‌మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారని అందిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు.

ధన్యతోపాటు ఆమె తమ్ముడు శామ్యూల్ కూడా అరెస్ట్ అయ్యాడు. శాంసన్ అండ్ సన్స్ సంస్థ తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరంతా కలిసి బాధితులు ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసి ముఖం చాటేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. ధన్య మామ జాకబ్ శాంసన్‌ని గతంలోనే క్రైం డిటాచ్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 2014 నుంచీ ఈ కేసు నడుస్తోంది.

Popular Malayalam actress Dhanya arrested in Rs 130 cr financial fraud case

ఈ హీరోయిన్ తన భర్తతో కలసి రియలెస్టేట్ బిజినెస్ పేరుతో ఒక్కొక్కరి దగ్గర దాదాపు 40 లక్షల నుంచి కోటి వరకు తీసుకునేది. అలా సంపాదించి 100 కోట్ల వరకు వెనకేసుకున్నారు కూడా! ఇక గతంలో వీరు మోసాలకు పాల్పడినట్టు సమాచారం అందడంతో రెండేళ్ళ క్రిందటే వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటికీ ఆగని వీరి ఆగడాలు చూసి కొందరు తట్టుకోలేక బయటపెట్టారు. ఇంకేముంది వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ధన్య నటించిన తమిళ మూవీ 'దొంగ' చిత్రంతో బాగా పాపులర్ అయ్యి, మరి కొన్ని చిత్రాల్లో నటించడమే కాకుండా ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకుంది. 31 సంవత్సరాల ధన్య తమిళ సినిమా 'తిరుడి' (దొంగ) చిత్రం ద్వారా 2006లో సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మలయాళ రంగంలోకి అడుగుపెట్టారు. పలు సినిమాల్లో తన నటనతో ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకున్నారు. ఈమె టీవీ సీరియళ్ళలోనూ తన నటన పండించారు. జాన్ కూడా పలు సినిమాల్లో నటించాడు. 2012లో వివాహం చేసుకున్న ధన్య, జాన్ జంటకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

English summary
Malayalam actor Dhanya Mary Varghese, her husband John and his brother Samuel, were on the run after complaints filed by clients.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu