»   » నాకొడుకు విడాకులు, విషెస్ చెప్పండి: బ్రహ్మాజీ ట్వీట్

నాకొడుకు విడాకులు, విషెస్ చెప్పండి: బ్రహ్మాజీ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఈ న్యూస్ సినిమాల గురించి కాదు... ఆయన కుటుంబం గురించి తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ వార్త తెలపడంతో హాట్ టాపిక్‌గా మారింది. చెప్పిన విషయం కూడా సంతోష కరమైన వార్తేమీ కాదు తన కొడుకూ కోడలూ విడిపోతున్నారన్న వార్తని ట్విట్టర్ లో చెప్పాడు.

త్వరలోనే విడాకులు

త్వరలోనే విడాకులు

‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారని., వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారని చెప్తూ. ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని ట్విట్టర్ ద్వారా బ్రహ్మాజీ కోరుకున్నాడు. బ్రహ్మాజీ చూడ్డానికి ఎంత యంగ్‌గా ఉంటాడు.

తనయుడి పేరు సంజయ్

తనయుడి పేరు సంజయ్

ఆయనకు పెళ్లీడు కొడుకు ఉన్నాడంటే నమ్మడం కాస్త కష్టమే. ఆయన తనయుడి పేరు సంజయ్. సంజయ్ వివాహం 2013 లో బెంగాళీ అమ్మాయితో కోల్‌కతాలో ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇంద్రాక్షి తో జరిగింది. మరి ఈ మూడేళ్ళలో ఎమైందో గానీ వాళ్ళిద్దరి కాపురం ఇప్పుడు విడాకులదాకా వచ్చింది.

అందరూ విషెస్ తెలపండంటూ

అందరూ విషెస్ తెలపండంటూ

ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న బ్రహ్మాజీ అలాగే వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉండాలని అందరూ విషెస్ తెలపండంటూ ట్విట్ చేశాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం బ్రహ్మాజీ కుమారుడు హీరోగా ఓ సినిమా తీస్తున్నాడట... కాని ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై బ్రహ్మాజీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా

బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. తండ్రి రెవిన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తండ్రి ఉద్యోగరీత్వా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు.

కృష్ణ అభిమాని

కృష్ణ అభిమాని

చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులుకు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు. మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఏ.ఎం.ఐ.ఈ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు.

 ఆ కలని తన కొడుకు ద్వారా

ఆ కలని తన కొడుకు ద్వారా

ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది. ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు. అయితే ఎందుకనో ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాలేక పోయాడు బ్రహ్మాజి ఆ కలని తన కొడుకు ద్వారా తీర్చుకోవాలనే ఆలోచనకూడా ఉన్నట్టుంది.

English summary
"Sad to inform that my son Sanjay and his wife Indrakshi now separated fr 5 months are getting divorced .wish them happiness and better luck" Tweets Brahmaji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu