»   » కొత్త తరహా ప్రేమ కథ ('పోరా.. పోవే' ప్రివ్యూ)

కొత్త తరహా ప్రేమ కథ ('పోరా.. పోవే' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రచయితే ...దర్శకుడు అయితే ఉండే సౌలభ్యం వేరు. ఇది గమినించారేమో కానీ తెలుగులో వరసగా రచయితలంతా దర్సకులుగా అవకాశాలు పొంది తమ ప్రతిభను మరో కోణంలోనూ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవలో 'బెట్టింగ్‌ బంగార్రాజు', 'పూలరంగడు', 'ఆడు మగాడ్రా బుజ్జీ', 'నువ్వే నా బంగారం' తదితర చిత్రాలకు రచయితగా పనిచేసిన లంకపల్లి శ్రీనివాస్‌ దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం ఇది. వినోదాత్మకంగా సాగే ప్రేమ కథ అని చెప్తున్నారు. 


కథేమిటంటే.... ఇంజినీరింగ్‌ చదువుకొంటున్న విద్యార్థి వికాస్‌ (కరణ్‌). అప్పటిదాకా అమ్మాయిల సాంగత్యం ఎరుగని ఆ కుర్రాడికి శ్రీచైతన్య (సౌమ్య సుకుమార్‌)తో పరిచయం ఏర్పడుతుంది. అప్పటిదాకా గర్ల్స్‌ స్కూల్‌లో చదువుకోవడంతో శ్రీచైతన్య కూడా తనకు తొలిసారి పరిచయమైన వికాస్‌పై తొందరగా ప్రేమ పెంచుకొంటుంది. అంతలో ఇద్దరి మధ్య విబేధాలు. మరి వారి ప్రేమకథ ఎక్కడిదాకా చేరిందన్నది కథ.

Pora Pove..telugu Movie preview

దర్శకుడు మాట్లాడుతూ... ''స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. మంచి పుస్తకంలా తీర్చిదిద్దాం. యువతరం ఆలోచనలు, వారి మధ్య తలెత్తే చిన్న చిన్న తగాదాలు ఎలా ఉంటాయన్న విషయాల్ని వినోదాత్మకంగా తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకొనేలా ఉంటుంది. యాజమాన్య స్వరాలు, చంద్రబోస్‌ సాహిత్యం చిత్రానికి బలాన్నిచ్చింది. ఇదివరకు పనిచేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించా'' అన్నారు.

చిత్రం: పోరా.. పోవే
నటీనటులు: కరణ్‌, సౌమ్య సుకుమార్‌, అరవింద్‌, శ్రీనివాస్‌, చంటి ఎఫ్‌.ఎమ్‌ బాబాయ్‌ తదితరులు.
సంగీతం: యాజమాన్య
పాటలు:చంద్రబోస్,
కెమెరా:జైపాల్‌రెడ్డి,
ఆర్ట్:కృష్ణ,
ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్
నిర్మాత: యెల్కిచర్ల వీరేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ బింగమళ్ల
దర్శకత్వం: లంకపల్లి శ్రీనివాస్
విడుదల: 18-07-2014.

English summary
Karan and Sowmya Kumar’s Pora Pove releasing today. This movie directed by Lankalapalli Srinivas and Produced by Yelkicharla, Srinivas Bingamalla under the banner of SV Movie Makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu