»   » సినీ పరిశ్రమలో డ్రగ్స్, రవితేజ తమ్ముడిపై.... పోసాని హాట్ కామెంట్!

సినీ పరిశ్రమలో డ్రగ్స్, రవితేజ తమ్ముడిపై.... పోసాని హాట్ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్న మాట వాస్తవమే అన్నారు ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి. డ్రగ్స్ తీసుకునే వారు, డ్రగ్స్ ఇచ్చే వారు సినిమా ఫీల్డులో ఉన్నారన్న ఆయన ఒకరిద్దరి వల్ల మొత్తం ఇండస్ట్రీ పరువుపోతోందన్నారు. నిర్మాతలు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలపై స్పందించిన పోసాని... పబ్బులు, క్లబ్బులకు వెళ్లే నటులకు ఈ అలవాటు ఉందని అన్నారు. కొకైన్ రుచి కాదు కదా... దాన్ని రియల్ కూడా చూడలేదని తెలిపారు.

ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాగి రెడ్డిగారు, హెచ్ఎం రెడ్డిగారు, పుల్లయ్యగారు, రామానాయుడుగారు ఇలాంటి గ్రేట్ ఫెలోస్ చేతుల్లోంచి ఎంతో గొప్పగా ఎదిగింది. అలాంటి గొప్ప ఇడస్ట్రీకి డ్రగ్స్ వ్యసనం పాకిన మాట నిజమే. భారత దేశంలో ఏ వ్యవస్థలో అయినా సరే కొంత డిస్ట్రబెన్స్ ఉంటుంది. వాటిపై సిరా మరకలు పడ్డట్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ రూపంలో సిరా మరకలు పడ్డాయి. అది తెలుగు పరిశ్రమ దురదృష్ణమని పోసాని అన్నారు.

మంచి వారితో పాటు చెడ్డవారు కూడా

మంచి వారితో పాటు చెడ్డవారు కూడా

ఇక్కడ మేము క్లీన్ గా ఉండటానికి వచ్చాం. ఇక్కడ మాకు డబ్బు దొరుకుతుంది, దీని ద్వారా పేరొస్తుంది కాబట్టి వచ్చాము. దీని ద్వారా స్థాయి పెరుగుతుంది, దీని ద్వారా గౌరవం పెరుగుతుంది. దీని ద్వారానే ఎన్టీ రామారావు లాంటి వారు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రానికి సేవ చేశారు. ఇక్కడికి అన్ని కులాల వాళ్లు అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఎలాంటి బేధం లేకుండా అందరూ రావచ్చు. ఇలా వచ్చే క్రమంలో మంచి వారితో పాటు కొందరు చెడ్డ వ్యక్తులు కూడా వస్తారు అని పోసాని అన్నారు.

పబ్బులకు, క్లబ్బులకు వెళ్లేవారికి అలవాటు ఉంది

పబ్బులకు, క్లబ్బులకు వెళ్లేవారికి అలవాటు ఉంది

ఈ డ్రగ్స్ వలన మా సినిమా పరిశ్రమ ఎప్పుడూ కుదుపుకు గురవ్వలేదు. క్లబ్బులకు, పబ్బులకు వెళ్లే కొందరు నటులు డ్రగ్స్ వాడుతున్నారని పేపర్లో చూశాను. ఆ విషయాన్ని నేను నమ్ముతున్నాను. డగ్స్ వేరేవాళ్లకు ఇచ్చే వారు కూడా ఉన్నారనే విషయం కొందరి ద్వారా నాకు తెలిసింది. ఇవి కేవలం నేను విన్న మాటలు మాత్రమే... అయితే పలానా వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడని, డ్రగ్స్ ఇస్తున్నాడని నాకు తెలియదు అని పోసాని అన్నారు.

రవితేజ తమ్ముడు భరత్ గురించి

రవితేజ తమ్ముడు భరత్ గురించి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రవితేజ తమ్ముడు భరత్.... నాకు తెలినంత వరకు వెరీ క్లీన్ బాయ్, ఎప్పుడూ వోల్ హార్టెడ్ గా మాట్లాడతాడు. అతడిలో ఉన్న గుణం అవినీతి పరుడు కాదు, అక్రమాలు చేయడు, ఎవరినీ చీట్ చేయడు. డబ్బు తీసుకుని ఎగ్గొట్టడు, వెన్నుపోటు పొడవడు, వాడకుని వదిలేసే రకం కాదు. దురదృష్ణం ఏమిటంటే అతడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవే డ్రగ్స్, మందు... అదెందుకు అవాటయిందని నేను అనుకుంటున్నానంటే... అతడు చాలా ఇష్టపడి వివాహ జీవితంలోకి అడుగు పెట్టాడు. అది చిన్న కుదుపుకు గురైంది. అతడు పేపర్ లాంటోడు, పేపర్ చిన్న గాలొచ్చినా ఊగిపోద్దో అతడు కూడా చిన్న బాద వచ్చినా ఊగిపోయే మనిషి. భరత్ నాకంటే మంచి మనిషి అని.... పోసాని తెలిపారు.

డ్రగ్స్, మందు అలవాటుపై

డ్రగ్స్, మందు అలవాటుపై

పేపర్లో, టీవీలో చూడటం తప్ప.... డ్రగ్ రియల్ గా కూడా చూడలేదు. మందు కూడా చాలా రేర్ కొడతాను. కాలేజీ రోజుల్లో ఒకటి రెండు సార్లు తీసుకున్నాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక మా బావమరిది అమెరికా నుండి వచ్చినపుడు, చాలా క్లోజ్ వ్యక్తులతో ఒకటి రెండు సార్లు ఒకటి రెండు పెగ్గులు మాత్రమే తీసుకున్నాను అని పోసాని తెలిపారు. నేను మందు తాగి ఎన్ని సంవత్సరాలైందో నాకే గుర్తులేదు. డ్రగ్స్ లాంటి అలవాట్లు నాకు లేవు, నా కుటుంబంలో ఎవరికీ లేవు అని పోసాని అన్నారు.

English summary
Posani Krishna Murali hot comment about Tollywood and Drugs. Check out full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu