»   » కిన్నెరకి భరోసా..! పోసాని మరోసారి తానేమిటో చూపించాడు

కిన్నెరకి భరోసా..! పోసాని మరోసారి తానేమిటో చూపించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమలో పోసాని కృష్ణమురళిది ఓ విభిన్నమైన మనస్థత్వం. ఏ విషయంపైనైనా లోపల ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడటం ఆయనకు చేతకాదు. దూకుడైన స్వభావంతో.. ముక్కుసూటిగా మాట్లాడే నటుడు పోసాని కృష్ణమురళి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలైనా.. సమకాలీన రాజకీయాలైనా.. నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు పోసాని.

కుండబద్ధలు కొట్టినట్టే తన మనసులోని మాటను ఆయన వెల్లడిస్తారు. ఆయనలోని మరో కోణం ఏమిటంటే, కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం. కష్టాల్లో ఉన్న వారు ఎదురైతే ఆయన చలించిపోతారు. తాజాగా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆయన రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, భవిష్యత్తులో తిండికి, బట్టకు ఏ లోటు వచ్చినా.. ఆదుకునేందుకు తానెప్పుడూ సిద్దంగానే ఉంటానని భరోసా ఇచ్చారు.

 Posani Krishna Murali financial aid for Kinnera artist

గతంలో 52దేశాల ప్రతినిధులను తన కిన్నెర వాయిద్యంతో ఉర్రూతలుగించారు మొగులయ్య. ఈరోజుల్లో 12మెట్ల కిన్నెర వాయిద్యంతో గానం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మొగులయ్య కావడం విశేషం. ఆయన తర్వాత ఆ కళ సజీవంగా బతికి ఉండాలంటే.. ప్రభుత్వం చొరవ చూపి కిన్నెర మెట్ల కళను బావితరాలకు అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

English summary
posani KrishnamuraLi financial aid for Kinnera artist Darshanam Mogilaiah who is kinnera player in Telangana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu