For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బు వాడి అబ్బ జేబులోంచి ఇస్తాడా? రూ. 3 కూలి పని చేశా, బోయపాటి నా శత్రువుకాదు: పోసాని

  By Bojja Kumar
  |

  సమాజంలో జరిగే ప్రతి అంశంపై, రాజకీయాలపై నటుడు పోసాని కృష్ణ మురళి తనదైన రీతిలో స్పందిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఈ విషయాలు వీడికెందుకురా? అని విమర్శిస్తుంటారు. ఇలా విమర్శించే వారికి పోసాని తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

  Posani Krishna Murali : Chandrababu Good Human Than YS Jagan

  నాకు ఓటు హక్కు ఉంది, ఓటు వేస్తున్నాను. ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో ఏ మూల ఏం జరిగినా..... అది నాకు బాధ అనిపించినా, సంతోషం అనిపించినా స్పందించే హక్క నాకు ఉంది. ఓటు వేయని వాడికి ఏమీ అడిగే హక్కు లేదు. నాకు ఉంది కాబట్టే దేనిపై అయినా స్పందిస్తాను, ప్రశ్నిస్తాను... అని పోసాని స్పష్టం చేశారు.

  నేను ఎప్పుడూ స్పృహలోనే ఉంటాను

  నేను ఎప్పుడూ స్పృహలోనే ఉంటాను

  నేను ఎప్పుడూ తప్పు మాట్లడలేదు. ఎప్పుడూ స్పృహలో ఉంటా. మత్తులో ఉండను. నేను పోసాని కృష్ణ మురళిని, నేను సమాజంలో ఉన్నాను. ఒక మనిషి నన్ను ప్రశ్నిస్తున్నాడు. దానికి సరైన సమాధనం చెప్పాలి అనే స్పృహలో ఉంటాను... అని టీవీ 9 ఇంటర్వ్యూలో పోసాని తెలిపారు

  డబ్బులు పడితే తప్ప అడుగు బయట పెట్టరట?

  డబ్బులు పడితే తప్ప అడుగు బయట పెట్టరట?

  నటుడిగా మంచి ఫాంలో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. డబ్బులు పడితే తప్ప అడుగు బయట పెట్టరట...నిజమేనా? అనే ప్రశ్నకు తనదైన రీతిలో స్పందించారు. పోసాని చాలా సినిమాలు తీసి అట్టర ప్లాప్ అయి, చాలా డబ్బులు పోగొట్టుకున్నపుడు వీడు ఎక్కడ ఉన్నాడు? అని ఎవరూ పట్టించుకోలేదు. డబ్బలన్నీ సిన్సియర్ గా వడ్డీతో ఫైనాన్సియర్ కు కట్టి, ప్రాపర్టీలు అమ్ముకుని, జీరో నుండి ఎవరెస్టు దాకా వచ్చాను. నేను ప్రతి దానికి డబ్బులు తీసుకుంటున్నాను అనే మాట వచ్చినపుడు నేను పడ్డ కష్టాల గురించి కూడా మాట్లాడాలి.... అని పోసాని అన్నారు.

  లైఫ్ లాంగ్ కూర్చుని బ్రతికేంత డబ్బు ఉంది

  లైఫ్ లాంగ్ కూర్చుని బ్రతికేంత డబ్బు ఉంది

  నేను ఎంత పోగొట్టుకున్నానో గోడకు కొట్టిన బంతిలాగా అంతా తిరిగి వచ్చింది. నేను, నా భార్య బిడ్డలు ఏ పని లేక పోయినా లైఫ్ లాంగ్ కూర్చుని బ్రతికేంత డబ్బు సినిమా పరిశ్రమ నాకు ఇచ్చింది. పరిశ్రమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.... అని పోసాని తెలిపారు.

  సుమ డబ్బు తీసుకోవడం లేదా?

  సుమ డబ్బు తీసుకోవడం లేదా?

  కొన్ని కమర్షియల్ షోలు ఉంటాయి. సుమ ఒక ఫ్రోగ్రాం చేస్తోంది. ఆ షోకు నన్ను పిలిచారు. డబ్బులడిగాను. సుమ కూడా డబ్బులు తీసుకుంటుంది కదా? నేనెందుకు తీసుకోకూడదు. సుమకు ఎంత పేరుందో నాకు అంతే పేరుంది. వరల్డ్ వైడ్ నాకు పేరు ఉంది కదా...? నేను సంపాదించే డబ్బులో కొంత సామాజిక సేవ కోసం వాడతాను, కొంత మంది పేదవారికి సహాయం చేశాను. చాలా గుండె ఆపరేషన్లు చేయించాను. ఓంకార్ ఛాలెంజ్ 3 అనే ప్రోగ్రాంకు పిలిచాడు, డబ్బులు తీసుకుని చేశాను. ఖుష్బూ పిలిచారు డబ్బులు ఇవ్వమని అడిగా, జబర్దస్త్ కు పిలిచారు డబ్బులివ్వమని అడిగాను. టీవీ 9 లాంటి న్యూస్ ఛానల్స్ పిలిస్తే ఫ్రెండ్లీగా వస్తా, నా కారులోనే వస్తా. ఎందుకంటే ఇవి కమర్షియల్ కాదు, జనం కోసం పని చేసే ఛానల్స్.... అని పోసాని తెలిపారు.

  3 రూపాయలకు కూలి పని చేశా

  3 రూపాయలకు కూలి పని చేశా

  మా నాన్న పేకాటలో డబ్బలు పోగొట్టుకున్నపుడు ఊర్లో 50, 100 కూడా ఎవరూ అప్పులు ఇవ్వలేదు. దీంతో మానాన్న అవమాన పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మానాన్న ఉన్నపుడు బాగా బ్రతికాం. ఆయన పోయిన తర్వాత ఇంట్లో తినడానికి కూడా కష్టం అయింది. అపుడు నేను టమాటలు నింపిన బుట్టలు కుట్టే పని చేశా. ఆ పని చేస్తే రెండు మూడు రూపాయలు కూలి వచ్చేవి. ఆ తర్వాత గుంటూరు థియేటర్లో బెంచీ టిక్కెట్లు అమ్మాను. సెకండ్ షో అయిపోయిన తర్వాత బస్సెక్కితే డబ్బులు ఎక్కువ అవుతాయని లారీ ఎక్కి మావూరు వచ్చేవాడిని. ఆ స్థాయి నుండి వచ్చాను..... అని పోసాని తెలిపారు.

  విజయ్ తన సినిమాలో జీఎస్టీ గురించి ప్రశ్నించడంపై

  విజయ్ తన సినిమాలో జీఎస్టీ గురించి ప్రశ్నించడంపై

  విజయ్ ‘అదిరింది' సినిమాలో జీఎస్టీ గురించి ప్రశ్నించారు. జీఎస్టీ ఎక్కువ వేస్తున్నారు అని ఆయన సినిమాలో ప్రశ్నించడంతో గొడవ జరిగింది. హాంకాంగ్ లో 7 శాతం ఉంటే మనకు 18 శాతం వేశారని సినిమాలో ప్రశ్నించారు. నేనంటాను విజయ్ ఈ మాట అనే ముందు.... సినిమాలో మనం నటిస్తూ ఇన్ని కోట్లు తీసుకుంటున్నాము. అన్ని కోట్లు వైట్ చెక్కు ఎందుకు తీసుకోవడం లేదు. చాలా డబ్బు ఎందుకు క్యాష్ రూపంలో తీసుకుంటున్నాము? అని విజయ్ పాత్ర ఆ ప్రశ్న వేసి ఉంటే విజయ్‌కు పాదాభివందనం చేసేవాడిని అని పోసాని వ్యాఖ్యానించారు.

  వాడి అబ్బ జేబులోంచి ఇస్తాడా?

  వాడి అబ్బ జేబులోంచి ఇస్తాడా?

  విజయ్‌కి నేను ఎందుకు సపోర్టు చేయాలి? ఆ సినిమాలో మన దేశాన్ని సింగపూర్‌తో ఎందుకు కంపేర్ చేయాలి? సింగపూర్ ఎంత? హైదరాబాద్‌లో సగం లేదు. ఆ చిన్న దేశంతో భారత దేశాన్ని పోల్చడం ఏమిటి? ఇక్కడున్నన్ని ఫెసిలిటీస్ అక్కడ ఇస్తున్నారా? సబ్సిడీలు ఇవ్వాలి, ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వాలి. రుణమాఫీ ఇవ్వాలి. ఎలక్షన్లో ల్యాప్ టాపులు, టీవీలు, సైకిళ్లు ఇవ్వాలి. వీటికి ఎవడు ఇస్తాడు డబ్బులు? వాడి అబ్బ జేబులోంచి ఇస్తాడా? నేను విజయ్ గురించి మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడే ముందు 50 నుండి 60 లక్షల జనాభా ఉండే దేశంతో 120 కోట్ల జనాభా ఉన్న మన దేశాన్ని కంపేర్ చేయడం తప్పు. జీఎస్టీ పెంచక, పెట్రోలు పెంచక వీటన్నింటికీ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి అంటూ పోసాని తనదైన రీతిలో స్పందించారు. జీఎస్టీ వల్ల కొన్ని గుడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి.... అని పోసాని అన్నారు.

  డబ్బు కోసం టీవీ ఇండస్ట్రీలోకి వచ్చా, రోజుకు 3 లక్షలు

  డబ్బు కోసం టీవీ ఇండస్ట్రీలోకి వచ్చా, రోజుకు 3 లక్షలు

  డబ్బు కోసమే టీవీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒక్కరోజు చేస్తే మూడు లక్షలు ఇస్తారు. బతుకు జట్కాబండి లాంటి కార్యక్రమాలు చేశాను. టీవీ వాళ్లకు నేను ఎందుకు నచ్చుతాడు మురళి బాగా చెబుతాడు, క్లెవర్ గా మాట్లాడతాడు. పిచ్చ పిచ్చగా మాట్లాడడు. లాజిక్ తో మాట్లాడుతాడు. కుటుంబాల మధ్య సమస్య వస్తే బాగా పరిష్కరిస్తారని ఇచ్చారు. ఆ కార్యక్రమంలో నా వల్ల 90 శాతం కలిశారు. నేను కూడా చాలా గ్రేట్ గా ఫీలయ్యాను.... అని పోసాని తెలిపారు.

  ప్రజలకు నచ్చింది, మీరెవరు? మీరెవరు ఆపడానికి

  ప్రజలకు నచ్చింది, మీరెవరు? మీరెవరు ఆపడానికి

  ఈ మధ్య టీవీల్లో అశ్లీలత ఎక్కువైంది, లిప్ లాక్ ముద్దులు, శృంగార సీన్లు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ... అది ప్రజలకు నచ్చింది, మీరెందుకు ఆపుతారు? ప్రజలే మేము చూస్తాం అంటున్నారు. ఒకప్పుడు ఇదే హైదరాబాద్ లో ఓ యూనివర్సిటీలో కిస్సుల ఫంక్షన్ పెట్టుకున్నారు. ఇది తప్పు అనేవారు దాన్ని ఎందుకు ఖండించలేదు. అపుడు మీరు ఖండిస్తే ఇపుడు నేను ఖండిస్తాను. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే ముద్దుకి, సోషల్ రెస్పాన్సిబిలీటీకి ఏమిటి సంబంధం అని అడుగుతున్నారు. ఇది సమస్యే... కానీ ఎవరి సమస్య కాదు. సమస్య అంటే వరకట్నం లాంటివి. ఇప్పటికీ ఆగడం లేదు. ఎంతో మంది ఆడవారి జీవితాలు నాశనం అవుతున్నాయి. అందరికీ తెలుసు. వాటి గురించి పట్టించుకోండి... అంటూ పోసాని తనదైన రీతిలో స్పందించారు.

  సెన్సార్ సమస్యపై

  సెన్సార్ సమస్యపై

  దేశం ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వార్డు మెంబర్ నుండి ప్రధాని వరకు ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రజలు ఎటెలుతున్నారు మనం ఎటు వెళ్లాలి అని మాత్రమే చూస్తున్నారు. ఎలా తయారైందంటే...ఈ ప్రజలను మనం బాగు చేయలేం. ఉన్నంతలో బాగా సంపాదించుకుని ఎలక్షన్లకు రెడీ అయిపోదాం. ఈ వెధవలకు కులం కార్డు, మతం కార్డు, ఓటుకు ఇంత ఇస్తే ఈ దరిద్రులు మనకు ఓటేస్తారు అనే రీతిలో రాజకీయ నాయకులు అయిపోయారు. ప్రజలకు తెలితేటలు ఉంటే వీరు మంత్రులవ్వరు, ఎంపీలవ్వరు, ముఖ్యమంత్రులవ్వరు. ప్రజలకు తెలివితేటలు ఉండకూడదు. ప్రజలు పిల్లిని చూపి అది కుక్క అంటే అది కుక్కే బాబు అంటారు. ప్రజలు ఏదైనా చెబితే అది రాజకీయ నాయకులకు నొప్పి కలగనంత వరకు అది ఎస్ అంటున్నారు. దానికి ఏం చేస్తాం. సెన్సార్ కూడా అంతే. మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వారికే సపోర్టు చేస్తున్నారు. సినిమాలో ఏంటి తప్పు అని అడిగితే వీపు చట్నీ అయిపోతాయి. 100 మంది గ్రూపు ఉంటే అది సొసైటీ. సొసైటీ ఏది చెబితే అదే కరెక్ట్ అనే రీతిలో తయారైంది. అలాంటపుడు నిజం సమాధి అయిపోతుంది.... అని పోసాని అన్నారు.

  బోయపాటి నాకు శత్రువు కాదు

  బోయపాటి నాకు శత్రువు కాదు

  నేను బోయపాటి శ్రీనును తిట్టాను. ఆ విషయం అందరికీ తెలుసు. బోయపాటి తప్పు చేశాడు కాబట్టి తిట్టాను. ఆ ఇష్యూ అయిపోయింది. వాడు నాకు శత్రువు కాదు. నేను తీసుకొచ్చిన పిల్లాడు తొందరపడ్డాడు అని బాధతో అన్నానే తప్ప... నేను గుడికి వెళితే నా కుటుంబంతో పాటు బోయపాటి కుటుంబం బావుండాలి, అందరి కుటుంబం బావుండాలని కోరుకుంటాను.... అని పోసాని అన్నారు.

  English summary
  In an exclusive interview with TV9 Media Channel, Posani Krishna Murali has opened up about his career in Cinema and the TV World. The actor has tried to defend himself from the various controversies linked with his comments on politics, film personalities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X