»   » జూ. ఎన్టీఆర్‌తో సమానంగా నాకు పేరు వచ్చింది

జూ. ఎన్టీఆర్‌తో సమానంగా నాకు పేరు వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టెంపర్ చిత్ర విజయంలో పోసాని కూడా ప్రధాన భూమిక పోషించారని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్‌తో సమానంగా నాకు పేరు వచ్చిందనుకుంటున్నాను. రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రను వేసిన ఆయన ప్రస్తుతం నటుడిగా బిజీగా మారారు. టెంపర్ చిత్రంలో ఆయన పోషించిన పోలీస్ పాత్రకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపధ్యంలో టెంపర్ చిత్రం నటుడిగా మీకు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? అని మీడియావారు ప్రశ్నించినప్పుడు ఇలా స్పందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పోసాని మాట్లాడుతూ... రచయితగా, దర్శకుడిగా పెద్ద విజయాలు సొంతం చేసుకున్నప్పుడు కూడా ఇంతటి ప్రశంసలు రాలేదు. దాసరిగారు ఫోన్ చేసి మురళీ... చాలా ఆనందంగా వుంది. యూ స్టీల్ ది షో. నువ్వు కూడా సినిమాలో ఓ హీరోలా వున్నావు. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్‌ను బాగా చేశావు అని మెచ్చుకున్నారు.

Posani Krishna murali Happy with temper result

అంతకుముందు నేను కామెడీ, వ్యంగ్యంతో కూడుకున్న పాత్రలు ఎక్కువగా చేసేవాణ్ణి. తొలిసారి ఓ నిజాయితీ మూర్తీభవించిన పాత్రను చేశాను. సాధారణంగా సినిమాల్లో హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందంటారు. కానీ టెంపర్‌లో నాకు, ఎన్టీఆర్‌కు మధ్య కెమిస్ట్రీ టెర్రిఫిక్‌గా వుందని అంటున్నారు. ఈ సినిమాలో నా పర్‌ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తూ వందల ఫోన్‌కాల్స్ వచ్చాయి అని చెప్పుకొచ్చారు.

కెరీర్ గురించి మాట్లాడుతూ... నేను 1986లో చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. అప్పటి నుంచి ఏ రోజూ ఖాళీగా లేను. రచయితగా వందకుపైగా సినిమాలకు పనిచేశాను. ఆ తర్వాత దర్శకుడిగా మారాను. ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నాను. ఇప్పటికీ దర్శకుడిగా, హీరోగా నాకు చాలా అవకాశాలొస్తున్నాయి. అయితే రచయితగా, దర్శకుడిగా కొన్ని అపజయాలు వున్నా నటుడిగా మాత్రం ఒక్కశాతం ఫెయిల్యూర్ లేదు.

అందుకే మున్ముందు నటుడిగానే చలామణీ అవుదామనుకుంటున్నాను. రచన, దర్శకత్వం తర్వాత నటుడిగా నేను థర్డ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టానని భావిస్తున్నాను. అయితే రచన, దర్శకత్వ బాధ్యతలకు పూర్తిగా దూరం కాను. నటుడిగా గ్యాప్ వచ్చిందని భావిస్తే తిరిగి వాటిపై తిరిగి దృష్టిపెడతాను అన్నారు.

English summary
Posani Krishna Murali Speaking proudly About His Charecter In Temper which is a very important role in this film as well as the best role in Posani's 25 years career which brought a terrific heroism in the film which made TEMPER a blockbuster hit
Please Wait while comments are loading...