»   » తీసి డస్ట్ బిన్ లో పారేస్తారు: పోసాని మళ్ళీ పంచ్ వేసాడు

తీసి డస్ట్ బిన్ లో పారేస్తారు: పోసాని మళ్ళీ పంచ్ వేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టొరీ రైటర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్నాడు. రచయితగా, దఋసకుడిగా కూడా చాలా సినిమాలే చేసిన పోసాని గతం లో అప్పుడప్పుడూ వెరైటీకోసం చిన్న పాత్రలు చేసేవాడు. కానీ పోనూ పోనూ పోసానికి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో వివాదాలను రేపే పోసాని మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం సినిమాల్లో ఎంతో మంది నటులున్నా తాను నటనలో ఇంకా రాణిస్తున్నాని అంతే కాకుండా నటుడిగా బిజీ అవ్వడం వల్లే మాటలు- దర్శకత్వం వంటి పనులను పక్కనపెట్టానని చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ సినిమాలకు వీడు పనికిరాదు అనుకుంటే మాత్రం డస్ట్ బిన్ లో పడేయడం ఖాయమని చెప్పారు.

Posani Krishna Murali stood in the news by making some sensational comments.

కానీ గత కొన్నేళ్లుగా తన నటనతో వారికి ఇంకా పనికొస్తూనే ఉన్నానని చెప్పారు. అలాగే తనను డస్ట్ బిన్ లో పడేయాలంటే నటనలోనే కాదు రచయితగాను తనకంటే బాగా టాలెంట్ మరియు దమ్మున్నోళ్లు రావాలని ఒకవేళ అటువంటి వారు వస్తే తనకి బయమేస్తుందని తెలిపారు. ప్రస్తుతం పోసాని ఎన్టీఆర్ - జై లవ కుశ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.

English summary
Posani Krishna Murali stood in the news by making some sensational comments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu