twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా తీయడం లేదు, వారికో న్యాయం, నాలాంటి బచ్చగాడికో న్యాయమా? ఎలక్షన్ కమీషన్‌పై పోసాని ఫైర్

    |

    Recommended Video

    Posani Krishna Murali Press Meet | Posani Sensational Comments On EC And Chandrababu Naidu

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా పోసాని సినిమా తీస్తున్నట్లు, ఇది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు ఎక్షలన్ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం పోసానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఇష్యూపై పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

    తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీయడం లేదని, తీస్తున్నట్లు ప్రకటన కూడా చేయలేదని... ఎవరో లెటర్ రాస్తే ఎలక్షన్ కమీషన్ నాకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరడం ఏమిటని? పోసాని ప్రశ్నించారు. తాను అలాంటి సినిమా తీయడం లేదని తిరిగి లెటర్ రాసినా మళ్లీ నాకు నోటీసులు జారీ చేశారని, వారి ముందు హాజరు కావాలంటున్నారని, ఇదకెక్కడి న్యాయం అంటూ పోసాని వాపోయారు.

    గతంలో ఎన్టీ రామారావు మీద 'మండలాధ్యక్షుడు' లాంటి రెండు మూడు సినిమాలు తీశారు. రామారావుగారికి ఈ విషయం చెబితే మేము కూడా ఆ సినిమా చూశామండీ... వారు సేమ్ నాలాగే చేశారు అని హుందాగా తీసుకున్నారు. అది లీడర్ క్యాలిటీ. చంద్రబాబు కొన్ని తప్పుడు పనులు చేశాడు కాబట్టే అతడిపై సినిమాలు తీస్తున్నారు. చంద్రబాబు మంచోడైతే అయితే ప్రజలు ఆ సినిమాలను నమ్మరు కదా... ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారంటూ పోసాని తనదైన శైలిలో విమర్శించారు.

    నేను సినిమా తీయడం లేదు, ఇదెక్కడి న్యాయం?

    నేను సినిమా తీయడం లేదు, ఇదెక్కడి న్యాయం?

    నేను చంద్రబాబుపై ఎలాంటి సినిమా తీయలేదు, విమర్శించలేదు. అయినప్పటికీ తన కార్యకర్తతో సినిమా ఆపేయాలంటూ ఎలక్షన్ కమీషన్‌కు లెటర్ పంపించారు. ఎలక్షన్ కమీషన్ గారిని నేను ఒకటే విషయం గౌరవంగా అడుగుతున్నాను. చంద్రబాబును మలినం చేయడానికి పోసాని సినిమా తీశాడు అని మీకు లెటర్ పంపించారు అన్నారు కదా.. నేను సినిమా తీయడం లేదు. కానీ వారెవరో లెటర్ రాశారని చెప్పి నోటీసులు పంపడం ఏమిటని పోసాని ప్రశ్నించారు.

    పోసాని లాంటి బచ్చగాడికి ఒక నీతా?

    పోసాని లాంటి బచ్చగాడికి ఒక నీతా?

    రేపు ఊరికొకడు లెటర్ పంపిస్తారు నా మీద... ప్రతి రోజు నేను బస్ పాస్ తీసుకుని అమరావతికి తిరగాల్సిందే? చంద్రబాబు పలానా దొంగ పనులు చేశాడండీ అని నేను అంటాను... చంద్రబాబుకు లెటర్ రాసి పిలిపిస్తారా? ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ను లోకేష్ బాబు బ్రోకర్ అని తిట్టాడు... నేను లోకేష్ మీద కేసు పెడతా.. లెటర్ పంపించి ఆయన్ను కూడా పిలిపిస్తారా? వారిని పిలిపించి ప్రశ్నించలేని మీరు... నన్ను ఎందుకు పిలిపించారు? అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబుకు ఒక నీతి, పోసాని కృష్ణ మూరళి అనే బచ్చగాడికి ఒక నీతా? అంటూ ఫైర్ అయ్యారు.

    వారిని పిలిపిస్తే మీ కాళ్లకు దండం పెడతా

    వారిని పిలిపిస్తే మీ కాళ్లకు దండం పెడతా

    మనది రాజ్యంగ వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో నేనూ పౌరుడినే. అందరు పౌరులకు సమానమైన హక్కులు ఉంటాయి, మరి నన్నెందుకు చిన్న వాడిగా ట్రీట్ చేస్తూ లెటర్ పంపారు? నేను కంప్లయింట్ చేస్తే కూడా చంద్రబాబును పిలిపించి సంజాయిషీ ఇవ్వమని కోరుతారా? మీరు అలా చేస్తే నేను మీ కాళ్లకు దండం పెడతా... అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి పోసాని వ్యాఖ్యానించారు.

    నేను తీసేది సందేశాత్మక చిత్రం

    నేను తీసేది సందేశాత్మక చిత్రం

    నేను సినిమా గురించి అనౌన్స్‌మెంట్ చేయకుండా, ఏమీ చెప్పకుండా... ఎవరో లెటర్ రాస్తే ఎన్నికల సంఘం లాంటి ఒక పెద్ద సంస్థ నాకు లెటర్ పంపవచ్చా? అయినప్పటికీ నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి వారికి లేఖ రాశాను. నేను అలాంటి సినిమా చేయడం లేదు. ఏ పేరైతే చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు. నా సినిమా గురించి ప్రెస్ మీట్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. నేను వ్యక్తిగతంగా ఎవరినీ తిట్టకుండా వివిధ పార్టీల మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడటానికి సందేశాత్మక చిత్రం తీస్తున్నాను అని ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చినట్లు పోసాని తెలిపారు.

    అంత క్లియర్‌గా చెప్పాను... నేనెందుకు రావాలి?

    అంత క్లియర్‌గా చెప్పాను... నేనెందుకు రావాలి?

    నేను చంద్రబాబును తిడుతూ సినిమా తీయడం లేదు, నేను తీసేది సందేశాత్మక చిత్రం అని క్లియర్‌గా చెబుతూ లెటర్ రాసినా.... మీరు మళ్లీ నాకు 20వ తారీఖు వచ్చి స్వయంగా ఆ విషయం చెప్పండి అంటున్నారు. నేను ఎందుకు రావాలండీ? నేను సినిమా తీయడం లేదని తెలిసిన తర్వాత... క్లారిఫై చేసిన తర్వాత కూడా మళ్లీ రమ్మంటున్నారు. నేను వైసీపీ సానుభూతి పరుడిని కాబట్టి పిలుస్తున్నారా? తీసుకెళ్లి ఏం చేస్తారు? సెక్రటేరియట్ దగ్గర ఏమైనా చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబుకు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టి ఇదిగో సార్ ఇతడిని పట్టుకొచ్చామని చెప్పడానికా? ఎందుకు నన్ను పిలుపిస్తున్నారు... అంటూ పోసాని ప్రశ్నించారు.

    నేను వెన్ను పోటుదారుడిని కాదు

    నేను వెన్ను పోటుదారుడిని కాదు

    నేను వెన్ను పోటుదారుడిని కాదు, రౌడీ షీటర్ కాదు, బ్రోకర్ కాదు, లోఫర్ కాదు, నా మీద ఏ కేసు లేదు, ఏ వెధవ పని చేయలేదు, బ్యాంకులను మోసం చేయలేదు, అవీనితి చేయలేదు, తాగుబోతు, తిరుగుబోతును కాదు... ఏ చరిత్రా లేకుండా ఎవరో చెప్పారని చెప్పి లెటర్ పంపారు. నేను వివరణ ఇస్తూ లేఖ ఇచ్చిన తర్వాత కూడా నన్ను స్వయంగా రమ్మంటున్నారు ... ఇదెక్కడి న్యాయం అంటూ పోసాని ఫైర్ అయ్యారు.

    English summary
    Posani Krishna Murali Press Meet about Election Commission. Posani said he was not doing any film About Chandrababu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X