»   » నా భార్యను చచ్చిపొమ్మన్నా: రామ్ చరణ్‌ను అవమానిస్తారా? .... పోసాని ఫైర్!

నా భార్యను చచ్చిపొమ్మన్నా: రామ్ చరణ్‌ను అవమానిస్తారా? .... పోసాని ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఏ విషయంపై అయినా ఎమోషనల్ గా, తనదైన రీతిలో స్పందించే పోసాని కృష్ణ మురళి తాజాగా ప్రముఖ టీవీ జర్నలిస్టు జాఫర్ ఇంటర్వ్యూలో..... రామ్ చరణ్ కు సంబంధించిన ఓ విషయంపై ఎమోషనల్, ఘాటుగా స్పందించారు.

ఖైదీ నెం 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యండమూరిపై నాగబాబు చేసిన కామెంట్స్ గురించి పోసాని స్పందించారు. ఎండమూరి రామ్ చరణ్ మీద నీచమైన కామెంట్స్ చేయడం వల్లే నాగబాబు అలా స్పందించారని పోసాని సమర్ధించారు.

గతంలో యండమూరి రామ్ చరణ్ తేజను, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను కంపేర్ చేసి..... రామ్ చరణ్ ను అవమానించేలా మాట్లాడటం సంస్కార హీనం అని పోసాని అన్నారు. ఇద్దరిలో ఎవరు పెద్ద అని లెక్కేసుకుంటే వంద రెట్లు, వెయ్యి రెట్లు రామ్ చరణ్ పెద్ద అని పోసాని చెప్పుకొచ్చారు.

 రామ్ చరణ్ కు కోట్లు ఇవ్వడానికి రెడీ

రామ్ చరణ్ కు కోట్లు ఇవ్వడానికి రెడీ

రామ్ చరణ్ ను నాకు ఇప్పించండి ఇప్పుడంటే ఇపుడు రూ. 15 కోట్లు చెక్కుమీద సంతకం పెట్టి రెమ్యూనరేషన్ గా ఇస్తాను, నేనే కాదు ఎవరైనా ఇవ్వడానికి రెడీ. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా రూ. 15 కోట్లు ఇస్తారా ఎవరైనా? దేవిశ్రీ ప్రసాద్ ఆయనే మ్యూజిక్ కొట్టి, ఆయనే హీరోగా సినిమా చేస్తే ఎవరైనా 50 కోట్లకు కొంటారా? రామ్ చరణ్ సినిమాను 70 కోట్లు పెట్టి కొంటారు. అలాంటి హీరోను తీసుకెళ్లి నువ్వు హీనంగా మాట్లాడతావా? కంపేర్ చేయాలనుకుంటే నీ కొడుకునో నీ కుటుంబ సభ్యులనో కంపేర్ చేసి వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో చెప్పుకో అంటూ పోసాని... యండమూరిని ఉద్దేశించి మండి పడ్డారు.

చిరు, పవన్, నాగబాబు మంచివారు కాబట్టే

చిరు, పవన్, నాగబాబు మంచివారు కాబట్టే

చిరంజీవి చాలా అమాయకుడు కాబట్టి, పవన్ కళ్యాణ్ చాలా మంచోడు కాబట్టి, నాగబాబు మంచోడు కాబట్టి నోరు మూసుకున్నారు. 30 ఏళ్ల కిందట నువ్వేంటో తెలుసు... ఆ విషయాలను నాగబాబు ఎత్తాడా? అంటూ యండమూరి ఇష్యూపై పోసాని ఫైర్ అయ్యారు.

రామ్ గోపాల్ వర్మపై పోసాని స్పందన ఇలా

రామ్ గోపాల్ వర్మపై పోసాని స్పందన ఇలా

మెగా ఫ్యామిలీ మీద రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ చేస్తున్నాడనే అంశంపై స్పందిస్తూ..... రామ్ గోపాల్ వర్మ నిజాయితీగా ఉంటారు. రామ్ గోపాల్ వర్మ ప్లెయిన్ పేపర్ లాంటోడు. రామ్ గోపాల్ వర్మ కు మోడీ అయినా, పోసాని, చిరంజీవి, నాగబాబు ఎవరైనా ఒకటే. అతడు ఒక ఇంటెన్షన్ తో, ఒక మోటోతో ఎప్పుడూ స్పందించడు, గౌరవంగానే స్పందిస్తాడు, తనను ఎవరైనా గిల్లితే గిల్లుతాడు అని పోసాని తెలిపారు.

పద్మ అవార్డుల విషయంలో అన్యాయం

పద్మ అవార్డుల విషయంలో అన్యాయం

ఈ మధ్యన పద్మ అవార్డ్స్ గురించిన వివాదంపై పోసాని స్పందిస్తూ...అవార్డులను నేను నమ్మను, జనం ప్రేమించాలి. నాకు రాలేదు కాబట్టి అలా అనడం లేదు. ఆస్కార్ కంటే గొప్ప అవార్డు నాకు ప్రజలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అవార్డులు ఇచ్చే విషయంలో అన్యాయాలు జరిగిన మాట వాస్తవం. రికమండేషన్ తో అవార్డులు తీసుకున్నారు. ఇది వాస్తవం, దైవ సాక్షిగా చెబుతున్నాను. సాక్ష్యం లేని ప్రతీదీ అబద్దం కాదు అని పోసాని అన్నారు.

నా భార్యను చచ్చిపొమ్మన్నా

నా భార్యను చచ్చిపొమ్మన్నా

పుష్పలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ అమ్మాయి నాతో జాయిన్ అయిన తర్వాత నా పాత జీవితపు ఎఫెక్ట్ కూడా పడ్డాయి. ఇలాంటి రాక్షసుడు దొరికాడు అని మా అత్త మామ బాధ పడ్డారు. మా ఆవిడ కూడా ఓ సారి బాధతో చచ్చిపోతానంది. చచ్చిపోమన్నాను. నువ్వు చచ్చిపోవాలనుకుంటే లెటర్ రాసి హ్యాపీగా చచ్చిపో అన్నాను. పోసాని కారణం కాదని రాసి చచ్చిపో అన్నాను.
బ్రతకాలనుకుంటే నిజాయితీగా ఉండాలన్నాను. నేను అరుస్తాను. ఒక మాటకే చచ్చిపోతావా.... 24 గంటలు నీ పక్కన ఉండటమేనా సంసారమంటే...అని అర్థం అయ్యేలా చెప్పాను. అప్పడు నా భార్య నన్ను అర్థం చేసుకుంది. ఇద్దరం హ్యాపీగా ఉంటున్నామని పోసాని తెలిపారు.

చిరు సినిమా 150 కోట్లు, బాలయ్య సినిమా గురించి తెలియదు

చిరు సినిమా 150 కోట్లు, బాలయ్య సినిమా గురించి తెలియదు

నేను చిరంజీవి గారి ఖైదీ నెం 150 సినిమాలో నటించాను, తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్. ఇప్పటికి 130 కోట్లు వసూలు చేసింది. 150 కోట్ల వరకు వసూలు చేయొచ్చు. హిట్టా కాదా అనే విషయంలో నేను డబ్బులే లెక్కేసుకుంటా. బాలకృష్ణ సినిమాలో నేను చేయలేదు కాబట్టి నాకు దాని కలెక్షన్స్ గురించి తెలియదు అని పోసాని అన్నారు.

English summary
Posani Krishna Murali responded to Yandamuri Veerendranath's Comments on Ram Charan. Few months agoTelugu's Most popular novelist Yandamoori Veerendranath made some sensational comments against hero Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu