నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. ఏప్రిల్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఛల్ మోహన్ రంగ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ విరివిగా ప్రమోషన్ కార్యక్రమాలని నిర్వహిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నితిన్ కెరీర్ లో 25 వ చిత్రం కూడా ఇదే. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ చిత్రం ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు.
ఇప్పటికే విడుదలైన చిత్ర టైలర్, ఆడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఎక్కువ భాగం యూఎస్, ఊటీలో చిత్రీకరణ జరుపుకుంది. తాజగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధం అయిపోయింది.
సెన్సార్ టాక్ చిత్ర యూనిట్ కి బూస్ట్ ఇచ్చేవిధంగా ఉంది. సెన్సార్ సభ్యులు నుంచి ఛల్ మోహన్ రంగ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు సమాచారం. నితిన్, మేఘా ఆకాష్ మధ్య రొమాన్స్ ఆకట్టుకోవడం ఖాయం అని అంటున్నారు. సెన్సార్ సభ్యులు చల్ మోహన్ రంగ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికేట్ జారీ చేసారు. చిత్ర నిడివి 148 నిమిషాలు. అలాంటి హీరోయిన్ లిసీ ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.