»   » ‘శ్రీమంతుడు’ :50 డేస్.. ఎన్ని సెంటర్లు ( పోస్టర్స్)

‘శ్రీమంతుడు’ :50 డేస్.. ఎన్ని సెంటర్లు ( పోస్టర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది.

ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాతలు చిత్రం పోస్టర్స్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్స్ ని క్రింద స్లైడ్ షోలో అందిస్తున్నాం చూడండి. ఈ రోజుల్లో ఓ చిత్రం ఇన్ని సెంటర్లలలో యాభై రోజులు పూర్తి చేసుకోవటం అంటే మాటలు కాదు.


ఈ సందర్బంగా ఈ చిత్రంలోని ..చారుశీల సాంగ్ ని ఇక్కడ చూడండి...మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


స్లైడ్ షోలో ...పోస్టర్స్...


దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ...

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ...


"ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మేం కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఫ్యాన్స్‌కి మా టీమ్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. '' అన్నారు.నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ...

నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ...


"మా బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. మహేశ్, కొరటాల శివ గారికి స్పెష్ థాంక్స్. రాజకీయనాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూశారు. ఈ వారంలో సచిన్ టెండూల్కర్ కూడా చూస్తానన్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు చాలా చాలా థ్యాంక్స్'' అని అన్నారు.గిప్ట్

గిప్ట్


శ్రీమంతుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో ఆయన దర్శకుడు కొరటాల శివ ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు కొరటాల కు ఆదివారం సాయింత్రం ఓ ఆడి కారుని సైతం గిప్ట్ గా ఇచ్చారు.కెరీర్ లోనే బెస్ట్

కెరీర్ లోనే బెస్ట్


అందుకు కొరటాల ధాంక్స్ చెప్పటంతో ...నా కెరీర్ లోనే బెస్ట్ చిత్రం ఇచ్చారు అంటూ మరోసారి మహేష్ ఆయన్ను ప్రశంసించారు.కొరటాల శివ మాట్లాడుతూ ...

కొరటాల శివ మాట్లాడుతూ ...


''ఈ కథ ఒప్పుకొని, మమ్మల్ని ముందుండి నడిపించారు మహేష్‌. మాకంటే ఆయనే ఎక్కువ కథని నమ్మారు. ప్రేక్షకులకూ మా ప్రయత్నం నచ్చింది. తొలిరోజే 'సూపర్‌ హిట్‌' అనే ముద్ర వేసేశారు''అన్నారు.ముఖ్యమంత్రి సైతం...

ముఖ్యమంత్రి సైతం...


‘శ్రీమంతుడు' సినిమాను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఎకౌంట్‌ను వేదికగా చేసుకొని మహేష్‌ను అభినందించారు. "మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా చూశా. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడమనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. స్మార్ట్ విలేజ్ అంటూ మనం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంది" అంటూ తెలిపారు.విజయోత్సవం...

విజయోత్సవం...


మరో ప్రక్క 'శ్రీమంతుడు' విజయోత్సవాన్ని అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల 24న ఈ కార్యక్రమం జరగనుంది.నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ మాట్లాడుతూ ...

నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ మాట్లాడుతూ ...


''మహేష్‌బాబు ఆసక్తి మేరకు విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మహేష్‌ సినిమాలకు న్యూజెర్సీలో భారీ స్పందన లభిస్తోంది. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు మహేష్‌బాబు, శ్రుతి హాసన్‌, జగపతిబాబు, దేవిశ్రీప్రసాద్‌తోపాటు చిత్ర యూనిట్ హాజరవుతుంది''అని చెప్పారు.ఎక్కువ మంది ఉన్నారనే...

ఎక్కువ మంది ఉన్నారనే...


మహేశ్‌బాబు అభిమానులు న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నారని అందుకే ఈ వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సుమారు 3 వేల మంది తెలుగువారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని మాట్లాడుతూ...

నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని మాట్లాడుతూ...


''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రమిది. తొలి రోజు నుంచే శ్రీమంతుడు పేరుకు తగ్గట్టే సిరులు కురిపిస్తున్నారు''అన్నారు.తెర వెనుక, ముందు

తెర వెనుక, ముందు


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.English summary
Mahesh Babu’s latest blockbuster family entertainer, Srimanthudu,released on 7th August, completes its 50 day run today.
Please Wait while comments are loading...