»   » తమిళ్ లోకి కూడా రానా సినిమా: తేజా జాతకం మార్చే సినిమా అవుతుందా???

తమిళ్ లోకి కూడా రానా సినిమా: తేజా జాతకం మార్చే సినిమా అవుతుందా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించిన దగ్గుబాటి రానా జోగేంద్రా.. జోగేంద్రా జైబోలో జోగేంద్ర అంటూ 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తమిళంలో 'నాన్ ఆనయిట్టాల్'(నేను ఆదేశిస్తే..) అంటూ సందడి చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేసింది సినిమా యునిట్. రానా లాస్ట్ మూవీ 'ఘాజీ' అలాగే మూడు భాషల్లో విడులై మంచి విజయం సాధించింది. ఇప్పుడు అతడి కొత్త సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' కూడా మూడు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం మొదలైనపుడు తెలుగు సినిమానే కానీ.. విడుదల సమయానికి త్రిభాషా చిత్రం అయిపోయింది. తమిళం.. హిందీలోనూ పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు

టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు

రానా మొదటినుంచీ కూడా కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు అటు తమిళ్ లోనూ, హిందీలోనూ దొరికిన ప్రతీ ఆఫర్ని అందిపుచ్చుకుంటూ వచ్చాడు దాంతో అక్కద కూడా రానా కి మంచి ఫాలోయింగే ఉంది. మరీ ఒక రేంజ్ లో కాక పోయినా మిగతా హీరోలకంటే కొంచం బెటర్ అనే చెప్పుకోవాలి. అందుకే మొదలు పెట్టినప్పుడు ఒక్క తెలుగు లోనే అనుకున్నారు కానీ ట్రైలర్ కి వచ్చిన భీబత్సమైన రెస్పాన్స్ తో ఇప్పుడు ఈ సినిమాని అక్కడ కూడా విడుదల చేయాలనుకుంటున్నారట.రానా మార్కెట్ కి ఇంకాస్త హైప్

రానా మార్కెట్ కి ఇంకాస్త హైప్

నేషనల్ వైడ్‌గా రానా ఉన్న ఫాలోయింగ్‌ బట్టి రానా నటిస్తున్న అన్ని సినిమాలో ఇతర భాషల్లో కూడా అనువాదం అవుతున్నాయి. ఇటీవల రానా నటించిన ‘ఘాజీ' మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనువాదమై మంచి విజయాన్ని సాధించింది. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అక్కడ రానా మార్కెట్ కి ఇంకాస్త హైప్ ఇస్తుంది అనుకుంటున్నారు.ఫస్ట్ లుక్ లాంచ్

ఫస్ట్ లుక్ లాంచ్

తాజాగా తమిళంలో ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు చేసి ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. 'నాన్ ఆనయిట్టాల్' అనే పేరును తమిళ వెర్షన్‌కు ఖరారు చేశారు. నాన్ ఆనయిట్టాల్.. అంటే 'నేను ఆదేశిస్తే' అని అర్థం. ఈ మాట తమిళ జనాలకు చాలా ఈజీగా కనెక్టవుతుంది. ఎందుకంటే వాళ్లు దేవుడిలా ఆరాధించే ఎంజీఆర్ సినిమాలో ఒక పాట పల్లవి ఇదే మాటతో మొదలవుతుంది. ఆ పాట తమిళంలో సూపర్ పాపులర్.తమిళ ప్రేక్షకులు కనెక్టయ్యేలా

తమిళ ప్రేక్షకులు కనెక్టయ్యేలా

దాన్నే తన సినిమాకు టైటిల్‌గా ఎంచుకోవడం రానాకు కలిసొచ్చేదే. ఈ టైటిల్ ఈజీగా జనాల్లోకి వెళ్లిపోయే అవకాశముంది. కాజల్.. కేథరిన్ కథానాయికలుగా నటించడం కూడా ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. తేజ రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి.తెలుగులోకంటే తమిల్ లోనే ఎక్కువ క్రేజ్

మొన్నటికి మొన్న తమిళ నాడు లో జరిగిన ఎమ్మెల్యేల ప్రసహనం గుర్తుకు తెచ్చే డైలాగ్ "వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్‌లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం" అనే మాట ఇప్పుడు సినిమా మీద విపరీతమైన ఆసక్తిని పెంచింది తమిళనాట. ఇప్పుడు తెలుగులోకంటే తమిల్ లోనే ఎక్కువ క్రేజ్ వచ్చేసిందీ సినిమాకి.
English summary
Naan Aanaiyittal Trailer Starring Rana Daggubati, Kajal Aggarwal and Catherine Tresa
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu