»   » కేసీఆర్‌ కేసు ఎఫెక్ట్ ఉంటుందా? పవన్ నిర్మాతల్లో గుబులు!

కేసీఆర్‌ కేసు ఎఫెక్ట్ ఉంటుందా? పవన్ నిర్మాతల్లో గుబులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి పోయి రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాలకు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అనే చర్చ మొదలైంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల విషయం హాట్ టాపిక్ అయింది.

తాజాగా పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు‌పై అనంతపురం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. మురళీ కృష్ణ అనే న్యాయవాది ఈ కేసు వేసారు. ఆయన పిటిషన్ స్వీకరించిన అనంతపురం కోర్టు కెసిఆర్ పైన కేసు నమోదు చేయాలని గురువారం అనంతపురం టూటౌన్ పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. 30వ తేదీన కెసిఆర్ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తున్న పలువురు నిర్మాతల్లో గుబులు, అనుమానాలు నెలకొన్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొనడమే ఈ అనుమానాలకు మూలం తెలుస్తోంది.

గతంలో...

గతంలో...

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమురం పులి' తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అదే విధంగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కూడా వివాదాస్పదం అయింది. ఈచిత్రంలోని సన్నివేశాలు, డైలాగులపై తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. సినిమా ప్రదర్శన నిలిపి వేసాయి.

ఫ్యూచర్ ఏమిటి?

ఫ్యూచర్ ఏమిటి?

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? అనే అంశం చర్చనీయాంశం అయింది.

పరిస్థితి వేరు

పరిస్థితి వేరు

గతంలో ఉమ్మడి రాష్ట్రం....ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. పరిస్థితి పూర్తిగా వేరు

నైజాం

నైజాం

పపన్ కళ్యాణ్ సినిమాలకు ప్రధాన‌మైన, ఎక్కువ వసూళ్లు చేసే మార్కెట్ ‘నైజాం' ఏరియానే కావడం విశేషం.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం నైజాం ఏరియాలో 24 కోట్లు వసూలు చేసింది.

గబ్బర్ సింగ్ 2

గబ్బర్ సింగ్ 2

త్వరలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నారు.

ఓ మై గాడ్

ఓ మై గాడ్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హిందీ చిత్రం ‘ఓ మై గాడ్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో వెంకటేష్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. డాలి దర్శకత్వం వహిస్తున్నాు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

English summary
Power star Pawan Kalyan movies may face trouble in Telangana in future.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu