»   » పవన్ మాకు మళ్ళీ నిరాశేనా???: ఫస్ట్ లుక్ రావటం లేదట

పవన్ మాకు మళ్ళీ నిరాశేనా???: ఫస్ట్ లుక్ రావటం లేదట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సెప్టెంబర్ 2న పవన్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న 25వ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని నిర్మాణ సంస్థ హారిక-హాసిని క్రియేషన్స్ కొన్ని రోజుల కిందట గ్రాండ్ గా ప్రకటించింది. అలా ఎనౌన్స్ చేసిన కొన్ని గంటలకే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ పోస్ట్ ను తొలిగించింది.

ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇష్టంలేకనే

ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇష్టంలేకనే

అంతా అయోమయానికి గురైనా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ పోస్ట్ తీసేశారని అంతా అనుకున్నారు. కానీ పవన్ పుట్టినరోజు నాడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇష్టంలేకనే పోస్ట్ తొలిగించారని తాజాగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చే సరికి ఆ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

 ఫిలింనగర్‌ టాక్

ఫిలింనగర్‌ టాక్

రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్‌కు ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్‌గా మారింది. అయితే ఈ చిత్రం షూటింగ్ ముందస్తుగా వేసుకొన్న అంచనా ప్రకారం ముందుకు పోవడం లేదనేది ఫిలింనగర్‌లో తాజా టాక్.

షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది

షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది

ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోనూ బిజీ అవుతుండటంతో ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ముందుగా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని భావించినా.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఒక్క అఫీషియల్ అప్ డేట్ కూడా రాలేదు.

అభిమానులు నిరుత్సాహపడుతున్నారు

అభిమానులు నిరుత్సాహపడుతున్నారు

అయితే సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. చిత్ర నిర్మాతలు కూడా ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ తరువాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. దీంతో ఫస్ట్ లుక్ రిలీజ్ వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. చాలా రోజులుగా సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఫస్ట్ లుక్ వాయిదా పడిందన్న వార్తతో నిరుత్సాహపడుతున్నారు.

English summary
Power Star Pawan Kalyan and Trivikram combo Movie Fist look wich is sceduld to release this september 2 Has Been Postponed
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu