పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైలెంట్ కిల్లర్...!
పంజాలోని తన పాత్రగురించి ఫ్యాన్స్ వివిధ రకాలుగా పోల్చుకొంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైలెట్ కిల్లర్(రియల్ లైఫ్ కాదు రీల్ లైఫ్) అన్నది పంజా స్టిల్స్ చూస్తుంటే ఇట్టే తెలసిపోతోంది.. నిశ్శబ్దం చాలా అవసరం. ముఖ్యంగా వేటాడేటప్పుడు! అతను కూడా అంతే! ఎక్కువగా మాట్లాడడు. తన పనేదో తనది. కోపం, సంతోషం, బాధ... ఇవేమీ అతనిలో కనిపించవు. మనిషివా? మర బొమ్మవా? అన్నా స్పందించడు. ఆ మౌనం వెనుక ఉన్న అర్దమేంటి? అతని వేట ఎవరి కోసం? ఈ విషయాలు తెలియాలంటే "పంజా" చూడాల్సిందే..కేవలం ముప్పయ్ సెకన్ల టీజర్ తోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తాఏమిటో చూపిస్తున్నాడు. పంజా టీజర్ కి అప్పుడే యూట్యూబ్ లో రెండు లక్షలకి పైగా వ్యూస్ నమోదయ్యాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఇటీవలే పంజా ప్రచార చిత్రాన్ని యూట్యూబ్ లో ఉంచాం. రెండు రోజుల్లో రెండు లక్షల మంది వీక్షించారు. ఈ సినిమా మొదలుపెడుతున్నప్పుడు మేం అనుకొన్నది ఒక్కటే... పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకూ ఎవరూ చూపించని పాత్రలో తీర్చిదిద్దాలని. ఆయన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాం. "పంజా" అనేది కేవలం భావోద్వేగాలతో కూడిన కథ మాత్రమే కాదు. పవన్ సినిమాల్లో ఎలాంటి వినోదం ఉంటుందని ఆశిస్తారో... అది తప్పకుండా ఉంటుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. సారాజేన్ డయాస్, అంజలీ లావానియా నాయికలు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ నిర్మాతలు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల 13న ఆడియోను విడుదల చేయనున్నారు. డిసెంబరు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ"న్నారు.


Click it and Unblock the Notifications











