twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఫాలో అవ్వడు, ఇది షోలే రేంజే: చిరంజీవి (సర్దార్ ఆడియో ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ సమర్పణలో కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.

    ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, డైరెక్టర్స్ బాబీ, దేవిశ్రీప్రసాద్, ఎన్.టి.వి.అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి, నిర్మాతలు జెమిని కిరణ్, ఎ.ఎం.రత్నం, కబీర్ సింగ్, సాయిమాధవ్ బుర్రా, అనంత్ శ్రీరాం, సినిమాటోగ్రాఫర్ అర్థర్ విల్సన్, అండ్రూ, ఎడిటర్ గౌతంరాజు, రామజోగయ్య, అనంత్ శ్రీరాం, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

    Also Read: ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్

    బిగ్ సీడీని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఆడియో సీడీలను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తొలిసీడీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ''చాలాకాలం తర్వాత తమ్ముడు పవన్ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య సంవత్సరాలలో నేను ఎక్కువగా, రిపీటెడ్ గా చూసిన సినిమాయే ఏదైనా ఉందంటే గబ్బర్ సింగ్. గతంలో నేను కల్యాణ్ సినిమాలు చూశాను కానీ వేరే వ్యాపకం పెట్టుకుని చూసిన సినిమా గబ్బర్ సింగ్ కే జరిగింది. పవన్ కల్యాణ్ మాస్ ఎంటర్ టైనర్ ఆ చిత్రంలో అలరించాడు. ఇలా కదా పవన్ సినిమా ఉండాల్సింది. ఈరకంగా కదా అభిమానులు ఆయన అలరించాల్సింది కదా అని ముచ్చటపడి ఆ సినిమాలో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ చూస్తాను. దబాంగ్ ట్రీట్ మెంట్ వేరు. కల్యాణ్ తనదైన స్టయిల్ లో మార్చుకుని చేసిన చిత్రం. ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు. ట్రెండ్ ను సెట్ చేస్తాడని గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం మరో ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కల్యాణ్ మనసుకు దగ్గరైన సినిమా. కథ, స్క్రీన్ ప్లే తనది. డైరెక్టర్ బాబీ తన దర్శక ప్రతిభతో పవన్ కథను, కథాంశాన్ని తనదైన స్టయిల్ లో పవన్ ఇన్ పుట్స్ ను తీసుకుని అత్యద్భుతంగా తీశాడ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    స్లైడ్ షోలో చిరంజీవి చెప్పిన మరిన్ని వివరాలు, ఫోటోస్..

    షోలే రేంజిలో..

    షోలే రేంజిలో..

    నేను ఈ సినిమా సెట్స్ కు వెళ్ళాను. డిఫరెంట్ గా అనిపించింది. షోలే చిత్రంలో రాంపూర్ గ్రామం సెట్ ఎలా అయితే కనిపిస్తుందో ఈ చిత్రంలో రతన్ పూర్ గ్రామం సెట్ అలా అనిపించింది. షోలే అప్పట్లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో ఇప్పుడు ఈ చిత్రం మరో షోలే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు చిరంజీవి.

    హ్యూమన్, హ్యూమర్

    హ్యూమన్, హ్యూమర్

    పవన్ లో హ్యూమన్ యాంగిల్, హ్యుమర్ యాంగిల్ ఉంది. ఈ సినిమాలో ప్రతి అంశం ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. హ్యుమర్ టచ్ తో సినిమా సాగుతూ ఆద్యంతం అలరిస్తుంది. ఆడియెన్స్ ఎంత ఉత్సాహంగా ఈ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారో నేను అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను అన్నారు చిరంజీవి.

    డైరెక్టర్ అవుతానన్నాడు

    డైరెక్టర్ అవుతానన్నాడు

    కల్యాణ్ ఫ్యూచర్ డిసైడ్ చేసుకునే తరుణంలో ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. డైరెక్టర్ అవుతానన్నాడు. ఆ కోరిక తీర్చుకోవచ్చు కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం తనని యాక్టర్ అవమని అంటే కన్విన్స్ అవడమే కాదు, తర్ఫీదు కూడా పొందాడు. కష్టపడి ఈరోజు ఇలా అందరితో ఆదరింపబడుతున్నాడు అని చిరంజీవి చెప్పారు.

    గర్వపడేది నేనే

    గర్వపడేది నేనే

    పవన్ కల్యాణ్ ఎదుగుదలను చూసి మొదట గర్వపడేది మొదట నేను, తర్వాత నా తల్లిదండ్రులు అన్నారు చిరంజీవి.

    గబ్బర్ సింగ్ గురించి

    గబ్బర్ సింగ్ గురించి

    చాలాకాలం తర్వాత తమ్ముడు పవన్ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య సంవత్సరాలలో నేను ఎక్కువగా, రిపీటెడ్ గా చూసిన సినిమాయే ఏదైనా ఉందంటే గబ్బర్ సింగే అన్నారు చిరు.

    దబాంగ్ ట్రీట్మెంటు వేరు

    దబాంగ్ ట్రీట్మెంటు వేరు

    దబాంగ్ ట్రీట్ మెంట్ వేరు. కల్యాణ్ తనదైన స్టయిల్ లో మార్చుకుని చేసిన చిత్రం అన్నారు.

    ట్రెండ్ సెట్టర్

    ట్రెండ్ సెట్టర్

    ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు. ట్రెండ్ ను సెట్ చేస్తాడని గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది.

    అత్తారింటికి

    అత్తారింటికి

    తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం మరో ట్రెండ్ ను క్రియేట్ చేసింది అన్నారు.

    సర్దార్ గబ్బర్ సింగ్

    సర్దార్ గబ్బర్ సింగ్

    ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కల్యాణ్ మనసుకు దగ్గరైన సినిమా. కథ, స్క్రీన్ ప్లే తనది. డైరెక్టర్ బాబీ తన దర్శక ప్రతిభతో పవన్ కథను, కథాంశాన్ని తనదైన స్టయిల్ లో పవన్ ఇన్ పుట్స్ ను తీసుకుని అత్యద్భుతంగా తీశాడ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    English summary
    "Power Star Pawan Kalyan Is Trendsetter In Tollywood" Chiranjeevi says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X