»   »  పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ సర్‌ప్రైజెస్ ఇవే!

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ సర్‌ప్రైజెస్ ఇవే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవడం లేదు. అయితే ఆయన ఫాలోవర్స్ మాత్రం ఆయన పుట్టినరోజు సందర్బంగా హంగామా చేయడానికి ప్లాన్ చేసారు.

మరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అభిమానులు రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి బాణాసంచా కల్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సంబరాలు అంబరాన్ని అంటేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేసారు.

మరో వైపు ‘సర్దార్ గబ్బర్ సింగ్' టీం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదల చేస్తున్నట్లు నిర్మాత శరత్ మరార్ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఎలాంటి సర్ ప్రైజెస్ ఉన్నాయో స్లైడ్ షోలో చూడండి.

బ్రూస్ లీ


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' టీజర్ విడుదల చేయబోన్నారు.

కంచె

కంచె


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఇప్పటికే కంచె మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.

రేర్ పిక్చర్స్

రేర్ పిక్చర్స్


సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ ఆల్బంలోని ఫోటోస్ కొన్ని విడుదల చేసారు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్


సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టీం కూడా పవన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శంకరాభరణం


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శంకరాభరణం టీం కూడా స్పెషల్ టీజర్ విడుదల చేయబోతోంది.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


వీటన్నింటితో పాటు పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ రూపంలో అభిమానులు స్పెషల్ సర్ ప్రైజ్ అందుకోబోతున్నారు.

English summary
It is known that Powerstar Pawan Kalyan is so simple to appreciate any celebrations, be it his own birthday. But his followers can never let it go smooth without the hungama. Well! the much celebrated birthday of the actor is just few hours away and the celebrations are already touching the sky.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu